ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 వ ప్రకరణము.


ఆమాటలకు ఆతఁడు నవ్వుచు సొరంగమునఁ బ్రవేశించెను. ఆవీరపురుషుఁడును మెల్లగ వాని మెటనే లోనికి దిగ నారంభించెను. తోడనే యచ్చటి శిలావిగ్రహ మెప్పటి యట్ల గుహాద్వారమును మూసివేసెను.


2-వ ప్రకరణము.

రుద్రాంబ.

ఆంధ్రదేశమును బరిపాలించిన చక్రవర్తినులలో నొక్క రుద్రమదేవి తప్ప నామేకుఁ బూర్వుల' గాని, తరువాత వారిలో గాని స్త్రీ లెవ్వరును సిహాసనా రోహణ మొనర్చి యుండ లేదు. అందుచే నొక్క రుద్రమదేవియే యాంధ్ర దేశమునకు బ్రథమచక్రవర్తిని. తనతండ్రియగు గణపతిదేవునకుఁ బుత్ర సంతతి లేకపోవుటచేతను, తాను రాజ్య సింహాసనము నలంకరింపకమున్నే తనభర్త పరకగతుం డగుటచేతను, తనకుఁగూడ “ఉమక్క- రుయ్యమ" లను నిరుపురుకుమారికలు తప్ప కుమారకులు గలు గకపోవుట చేతను, రు ద్రాంబయే తండ్రి మరణానంతరమున రాజ్య భోరమును వహింపవలసి వచ్చెను. గణపతి దేవుఁడు తన యవసాన సమయమున నాజ్ఞాపించిన రీతిగా, శివదేవయ మొదలగు మంత్రి శేఖరులును, జన్నిగదేవమహారాజు మొదలగు సేనా నాయకులును, బ్రసాదిత్య నాయఁడు మొదలుగాగల భృత్యవరులును, ద్రి లింగరాజ్యమునకు రాజధానియగు ఏకశిలానగరమున మహోత్సాహముతో రుద్రాంబను బట్టాభిషిక్తురాలి నొసర్చి రత్న సింహాసనముపై కూర్చుండఁ బెట్టిరి. అందుచే నాంధ్ర సామ్రాజ్య పీఠము నలంక రించిన యొక యాగాడుదాని పాదములకు మ్రొక్కుట వీరపురుషాగ్రగణ్యు లగు కొందఱజు మాండలిక రాజులకుఁ దలవంపుగా దోఁచెను. చక్రవర్తినియెడఁ గలభయము చేఁ బై కేమియు నస లేక, శామీయవమానమును భరింప లేక, యామె చెట్టులైన రాజ్య పీఠము నుండి తొలగింపవలయు, సని దీక్ష వహించి, రాజ ద్రోహు లగు నా సామంతభూగం తులు తెనుఁగుజేళమునకుఁ బ్ర బలశ త్రువులగు దేవగిరి ప్రభువులతో లోలోనఁ గుట్రలు నేయ నారంభించిరి.

ఇంతియె కాక, శైవమతాభిలాషియు, జై సమత ప్రబలద్వేషియు నగు గణపతి దేవుఁడు, తన రాజధానియందు నివసించుచుండిన యనేక జైనులను మత ద్వేషముచే నా? వము గావించెను. ముప్పదియాలు జైన గ్రామముల సంత "మొనరించెను. మఱియు జైన దేవాలయములఁ గూల ద్రోయించి, తిరుగఁబడిన జైనుల గొల్ల జుపించుచుండుటచేత,