పుట:Andhra vaangmaya charitramu.pdf/26

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజయనగరసామ్రాజ్యమందలి

ఆంధ్రవాఙయచరిత్రము.



మొదటి అధ్యాయము.



విజయనగరరాజ్యోత్పత్తి

పండ్రెండవ శతాబ్దాంతమందు మహమ్మదీయులుఢిల్లీసింహాసనము నాక్రమించుకొని పదుమూఁడవ శతాబ్దమున నుత్తరహిందూస్థానమందలి హిందూరాష్ట్రములను గ్రమక్రమముగఁ దమవశముఁ జేసి కొనిరి. దక్షిణహిందూదేశమందలి రాజ్యములు హిందూరాజుల పరిపాలనలోనే యుండి పరదేశీయులవలన భయముఁ బొందకుండినవి, ఇట్లుండ క్రీ. శ. 1296 సంవత్సరమున నానాటి ఢిల్లీసుల్తానగు జలాలుద్దీన్ ఖిల్ జీ యనువానితమ్మునికుమారుఁ డగు అల్లాయుద్దీననుమహావీరుఁడు దక్షిణమున నున్న హిందూ రాజ్యముల జయింపనమకట్టి యస్వల్పమైన సేనతో దాడివెడలెను.

ఆకాలమందు దక్షిణహిందూస్థానమున విఖ్యాతయశులందు స్వతంత్ర పరిపాలనదక్షులు నగుహిందూరాజులు పరదేశీయులబాధ నెఱుఁగనివారై నిర్భయముగా రాజ్యము చేయుచుండిరి. దేవగిరియందు యాదవశూరుఁ డగు రామదేవుఁడు పరిపాలించుచుడెను. ఓరుగంటి యందు కాకతీయవంశజుఁ డగు వీరప్రతాపరుద్రుఁడు రుద్రునింబోలె