పుట:Andhra bhasha charitramu part 1.pdf/840

ఈ పుట ఆమోదించబడ్డది

కన్నడము, అఱవము, మళయాళము: మేల్ = మీదిభాగము; ఈ యర్థమున 'మేలు'కు దెనుగున వ్యస్తప్రయోగము లేదు); వల్ల(?)కాడు 'వల్లడి = ఆపద + కాడు' అని శ. ర, కాని 'వల్ల' పదము 'ఒలికి' ఒలుకుల (మిట్ట) అను పదములతో సంబంధించి యుండును. ఒలికి యనగా సొదపేర్చెడిచోటు); వాలు (?) మగడు (వాలు = ఖడ్గము అను నర్థము సరికాదేమో); వెరవేకి ('వెర' 'విరహ' శబ్దభవము; దీనికి వ్యస్తప్రయోగము లేదు); సంగ (?) మడుగు (సంగడ + మడుగు; 'డ' లోపము; కన్న. సంగడ = సమీపము; తె. సంగడము); సర (/) కట్టు (సరము = స్వరము ('ము' లోపము) + కట్టు); నవ(?)దండవల(నవ = జాడ, అనునర్థము సరిపోదు); సురే (?) కారము; సెల (?) కోల - కట్టె, (సెల = ముల్లు; కొనను ముల్లుగలకోల, కట్టె); సేస(?)బ్రాలు - కొప్పు (సేస = సం.శీర్ష); పీ(?) తోలు = పైనుండు సన్నని చర్మము; కంబర (?)త్రాడు (కంబర = కొబ్బెర; చూ. హిం. కోప్రా); గునా(?) మొలనూలు (చూ. కన్నడము: గున్నాంపట్టె = బంగారుపూత పూసినపట్టె; అఱవము: కురునాత్తగడు ముచ్చెబంగారు మూసిన పళ్లెము); అల్లి(?)తెమ్మర (అఱవము: అలరి = పరిమళముగల + తెమ్ = తేమగల ఎరల్ = గాలి, సౌరభమును శైత్యమునుగల గాలి); అల్లొ(?) నేరేడు (ప్రా. అల్లా = తల్లి, అల్లొ నేరేడు = తల్లినేరేడు, లేక పెద్దనేరేడు, అని యర్థము చెప్పవచ్చునా? లేక, ఆహ్లాదక = ప్రా. అల్హాఅఓ = తె. అల్లొ (-ల్లో); లేక, ఆర్ద్రక = ప్రా. అల్లఓ = తె. అల్లొ = రసముగల, అని చెప్పవచ్చునా?); ఆణి(?) పోటు = జీవస్థానము నందు పొడిచినపోటు; ఇల్లి(?)ముక్కు = పగిలి నెత్తురుకాఱెడి ముక్కు లోపలిభాగము: ఈ(?)రెండ (ఇవురు = ఈరు + ఎండ = చిగురువంటి, లేక లేత యెండ?); ఉల్లకుట్టు (ఉల్లము = హృదయము + కుట్టు); ఎల(?)గోలు (ఎల(రు) + కోలు = ఉత్సాహముగొనుట?); ఏడి(?)కోల (ఏరు = నాగలి; ఔపవిభక్తిక రూపము ఏరి, ఏటి, ఏడి); ఏట(?)వాలు (కన్న. ఏఱు = క్రి.మీదికిపోవు; వి. మీదికిపోవునేల; షష్ఠీరూపము: ఏఱ్ఱ = ఏట్ర = *ఏట్ట = తె. ఏట); ఏఱు(?) పిడుక (కన్న, ఏరు, ఎరుబు = పేడ, చూ. తె. ఏరుగు, ఎరువు); ఐ(?)నిల్లు (హిం. మరాఠీ. ఐన; కన్న. అయిను = మొదటి, ముఖ్యమైన + ఇల్లు = నట్టిల్లు, అంతర్గృహము); ఐ(?)మూల(అతిమూల?), ఓర(?)వలి = 'వన్నెకోక' అను శ. ర. అర్థము తప్పు; 'అంచుకోక' అనవలెను; (ఓర = అంచు); ఔ(?)కాపు (అవుకు + కాపు? = ఒకరికి లోబడి యుండవలసిన కాపురము?); ఔ(?)దల = నడితల, తల; కాట్ర(?)గడ = కంపకోట; (కాష్ఠ = *కాట్ర; దీని నుండియే 'కఱ్ఱ, కట్టె' అను పదములు గలిగినవి); కిట్టికోల = ఇఱికించుటకుగా నొకతట్టు కొనలజేర్చికట్టి చిన్నకోల