పుట:Andhra bhasha charitramu part 1.pdf/811

ఈ పుట ఆమోదించబడ్డది

మిశ్ర సమాసములు.

కేవల సంస్కృత ప్రాతిపదిక మాచ్ఛిక శబ్దముతో సమసింపదనియు, నట్టి సమాసములు పూర్వకవుల గ్రంథములలో గ్వాచిత్కముగ గాన్పించినను మహాకవులు వాని నుపయోగించి యుండుటచే నట్టివాని ననింద్యగ్రామ్యము లనవలెననియు, నట్టివాని సాదృశ్యమున నితరములను గల్పింప గూడదనియు, కల్పించినచో నవి గ్రామ్యములగుననియు లాక్షణికులు చెప్పుచుందురు. అనింద్యగ్రామ్యములని లాక్షణికు లుదాహరించిన సమాసములు.

కఱకంఠుడు, దినవెచ్చము, *రాయభారము, రాయభారి, చౌదంతి, చౌపదము, చౌపుటము, చౌషష్టి, కపిలకన్నులు, కపిలజడలు, జీవగఱ్ఱ, ప్రాణ గొడ్డము; నిత్యపడి, ఉత్తరజందెములు, అపదూఱు, అప(-వ)పాడి; అపరాతిరి, అపనమ్మిక, అపనమ్మకము, అపనెపము, పంచవన్నె(లు) మొదలయినవి.

[కఱకంఠా క్షమియింపుము. భార. అర. II; దినవెచ్చమునకునై తనమేనగల సొమ్ము గొదుకక బచ్చింట గుదువవైచు - పాండు. III.; దంతి దంతమ్ము లాతముగ ద్రిప్పుచు వాడు జౌపదమ్ములకు బిశాచమొకటి - జైమి. V.; లేళ్ళభంగిని జౌకళించి చౌపుటము లొక్కుమ్మడి పదునైదు నుఱికి యుఱికి - అనిరు. IV.; ఖగములగములు చవుషష్టికళలు గళలు - రుక్మాం. V.; లోధనిరతి బెద్దకాసపడి పాడి దొఱంగిన బ్రాణగొడ్డపుంబనులగు - భార. అను. Iv. -; అవనిపతులు పలువురపపాడి నొక్కని, దన్ను బొదివికొనివ దరలకెదిరి, పోటులాడి నాదు పుత్త్రుండు పడుటదా, గీర్తికరముగాని కీడుగాదు - మార్కం. VIII.; సొమ్మొకచోనుండగ నపనమ్మిక యొకచోటనుండు పరులకు నెపుడున్ - హరిశ్చ - V.; అట బోయినంతలో నపనెప మౌను - సారం. II; పంచవన్నియతోడ బ్రసవనారాచుని వెఱ్ఱచిచ్చఱకంట జుఱ్ఱినాడు - భీమ. I.]

ఇవిగాక గ్రంథములం దిట్టి సమాసము లెన్నియో కాన్పించుచున్నవి; కొన్ని మాత్ర మీ క్రింద నుదాహరింపబడుచున్నవి.

[దినబత్తెము - 'నీకు మొదలన్ దినబత్తెము నే నొడంబడన్. హరిశ్చ. IV. రసదాడి - 'రసదాడి చెఱకుతో బ్రతి వెఱ్ఱి చెఱకైన జానవాతెఱ ప్రతి చక్కెరగును - చంద్రభా.; రసవాడి సరి పదరచన గానక పోల్చి యనువైన తలపులు గనక నిల్పి - చంద్రాం. I. వీర

-'మట్టెలు పిల్లాండ్లు మఱి వీరమద్దియ లెలమిని దొడిగె దొయ్యలి యొకర్తు- ____________________________________________________________________

  • 'రాయభారము, రాయభారి' అను రూపములు తప్పనియు 'రాయబారము, రాయబారి' అనుటయే యొప్పనియు గొందఱుందురు. కాని, "దినవెచ్చము, 'రాయభారము' ఇత్యాదొఎ ప్రాకృత సమత్వేనాపి రూపం సువచనమ్. 'రాయభారులు' ఇత్య త్రాధర్వణోక్త మిత్వమ్" అని యహోబలు డనియుండుటచేత 'రాయభారము, రాయభారి' అను రూపములనే యాతడు స్మరించి వానికి సాధుత్వమును గల్పింప యత్నించెనని గ్రహింపవచ్చును. లేకున్న గఱకంఠాదులతో వాని నుదాహరించుటకు గారణము కనబడదు.