పుట:Andhra bhasha charitramu part 1.pdf/249

ఈ పుట ఆమోదించబడ్డది

ఈప్రక్క 3-వ పటమునం దాంధ్రాక్షరము లెట్లు రానురాను వికాసము నొందినవో చూపబడినది.

నాల్గవపటము రాజరాజ నరేంద్రుని నందంపూడి శాసనములోని యొక రేకునకు బ్రతిబింబము. అందలి వ్రాత ప్రత్యేకముగ నిప్పటి యచ్చులిపిలో వ్రాయబడినది. (క్రీ. శ. 976).

అయిదవపటము నన్నయభట్టరచిత భారతాదిపర్వపీఠీకలోని మొదటి యైదుపద్యములు నాతనినాటి లిపిలో నెట్లు వ్రాసియుందురో యానాటి శాసనాక్షరముల యాధారమున నూహించి నేనువ్రాసినది.

ఆఱవపటము తిక్కన కాలమునాటి కాకతి గణపతిదేవుని తామ్ర శాసనములోని యొక రేకునకు బ్రతిబింబము (శా. శ. 1153).

ఏడవపటము అన్న వేమారెడ్డి వనపల్లి తామ్రశాసనములోని యొక రేకునకు ప్రతిబింబము (శా. శ. 1300).

పైపటముల మూలమున నాంధ్రలిపి నానాటికి నెట్లు మాఱుచు వచ్చినదో తెలియనగును. తాటియాకులపై గంటముతో వ్రాయు నాచారము మూలమున రానురాను చదరముగనుండు తెనుగక్షరములు గుండ్రముగ బరిణమించినవి అవి యచ్చువచ్చిన నాటివరకు మాఱుచునే యుండినవి. అచ్చువచ్చిన తరువాతగూడ వానియందు మార్పులు కలుగకపోలేదు. క్రీ. శ. 1801 సంవత్సరపు ప్రాంతమున నచ్చుపడిన తెనుగు పుస్తకములను నేటి యచ్చుపుస్తకములతో బోల్చిచూచిన నీ విషయము స్పష్టము కాగలదు. తాటియాకులమీది లిపికిని, అచ్చులిపికిని జాల వ్యత్యాసము గలదు.ౘ , ౙ, లపై ౨ అను గుఱుతు క్రొత్తగా నచ్చులో కలిగినది. వెలుపల గిలుకరించు నాచార మచ్చుగ్రంధములనుబట్టి యంతరించినది. -- అను నర్ధానుస్వార చిహ్నమొకటి క్రొత్తగా జేరినది. సున్నపైవచ్చు హల్లునకు ద్విత్వము చేయుపద్ధతి పోయినది. ద్విత్వాక్షరము వెలుపల గిలుకరించుట యిప్పుడు భ్రష్టమయినది. గొలుసు కత్తుగ వ్రాయుట యిప్పటివిద్యార్థులయం దంతగ గానరాదు.

ఆంధ్రలిపి సంస్కారము.

ఆంధ్రలిపి చాలకష్టమైదనియు, భారతీయ లిపులలో దానియం దెక్కువ చిక్కులున్నవనియు, వేగము, వ్యవహారానుకూలత, --ప్తత నపేక్షించు నేటి నాగరకప్రపంచమున కది పనికిరాదనియు, దానిని ప్రస్తుతావశ్యకతల ననుసరించి సంస్కరించుకొన్నచో ననేక లాభములు గలుగ గలవనియు నిప్పు డొకయభిప్రాయము బయలువెడలినది. ఆంధ్రలిపిలో నిప్పు