పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/28

ఈ పుటను అచ్చుదిద్దలేదు

(పాత పదిక . పడి, ఆంధ్రం కేసి తిరగవలిసివచ్చి తిరిగాను. రకరకాల కవనాలతోనం నేను ఆంధ్ర సారస్వతంలో ప్రవేశం అర్థించుకుని చేరాను. గానశాస్త్రంలో గీతం, వర్ణం, కృతి, రాగం, మొదలైనవి ఏముటో పెద్దలవల్లా గ్రంధాలపల్లా నేర్చవలిసొచ్చింది. ఇల్లా కొంత తర్జనభర్జన పడి, పద్యం రాగం అనే మాటలకి సంబంధించిన యథార్థాలు ఎక్కడ తారసిల్లినా సరే పోగుచేసుకోడం, అవి మననం చేసుగుంటూ ఉండడం, పని అయింది అసలు ఇంతలో, అనగా 1924లో బందరులో నటసారస్వత మహాజనసభ అయింది. అప్పుడు నాట్యకళావరణలో నాటకకర్తలుగుడా ఉండవచ్చు ననుకునేవారు. నటసభకి శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారున్నూ సారస్వత సభకి శ్రీ కాళీ కృష్ణాచార్యులుగారున్నూ అధ్యక్షత వహిం చారు. ఆ రెండుమూడు రోజులూ జరిగిన ప్రతీ ప్రత్యేక నమావేశసందర్భంలోనూ వారిద్దరూకుడా అధ్యక్షించేవారు. కార్య క్రమంలో అచ్చుపడ్డ ఉపన్యాసకుల్లో కొందరు రాలేదు. కొత్తవాడైన నాకు మొదటి రోజు ఉదయాన్నే “ ఛాన్సు ' ఇచ్చారు. నా విషయం “ సోటక పద్యగానం. ” అక్కణ్ణించి, ఆ సాయంత్రమూ, మర్నాడు పొద్దున్నా సాయంత్రమూ నేను ప్రసంగించడమే. నాకు అప్పుడప్పుడు ప్రతికూలంగా సబబులు రావడం, నేను వాటిని పూర్వపక్షం చెయ్య జానికి ఉపన్యసించడ మే తప్ప, మరెవరూ ఉపన్యసించ లేదు. మరో విషయం ఏదీ చర్చింపబడలేదు. నా గోల ఏమని అంటే: అన్యత్వం స్థాపించడానికి ఏర్పడ్డ నాటకరంగం మీద, స్వత్వాన్ని మిక్కిలి శాయ వరిచే రాగం వట్టిగెళ్ళి ప్రత్యేక గమన వ్యక్తిత్వంగల పద్యానికి సంధానం చెయ్యయత్నించడం నాటక పరమావధికి భంగకరం అయి ఊరుకోవడమే కాక, విరుద్ధమార్గంలో వర్తిస్తుంది - అన్ని