పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/150

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వ సంప్రదాయాలు 8 125 అట్లాగే నరసభూపాలీయకర్త సాహిత్యసంగీత రసాల్ని పోలుస్తూ, చెప్పిన పద్యం: ఒకటి యక్షర విలాసోల్లాసమున మించ, నొకటి తాళప్రౌఢీ నుల్లసిల్ల నొక్కటి నారి కేళోన్నతి దాల్ప, నొక్కటి గోస్తనీ గుచ్ఛకలనఁ దనర నొకటి సువృత్తభావోన్మేష మొంద, నొక్కటి వల్లకీ తుంబికలనఁ జెలఁగ నొకటి భారవి శేషయుక్తిఁ బెంపొంద నొక్కటి గిరీశమతానుకారి గాఁగ నసమ సాహిత్య సంగీత రసము లనెడు గుబ్బపాలిండ్లు దాల్చు పల్కుల వెలంది సరసగుణహారు నోబయ నరసధీరు నవ్యకృతినాయకునిఁగా నొనర్చుఁగాత” ఒకే మో స్తరుగా కనిపించే సాహిత్య సంగీతాల యొక్క రసాలలో ఉండగల భేదం, ఇందులో మూర్తికవి చాలా సరసంగా విశదీకరించాడు. 9 ఉచ్చారణదక్షుడివల్లనే 'శబ్దం' జీవిస్తుంది. – అనే అభిప్రాయం వెలిబుచ్చుతూ, నన్నయభట్టు : (శుక్రాచార్యుల పొట్ట చీల్చుకుని పైకి వచ్చిన కచుడు, శుక్రా చార్యులే తనకి ప్రసాదించిన సంజీవినీమంత్రం శుక్రాచార్యుల కళేబరం మీదే ప్రయోగించిన సందర్భంలో). విగతజీవుఁడై పడియున్న వేదమూర్తి యతనిచేత సంజీవితుండై వెలింగె దనుజమంత్రి, యుచ్చారణదము చేత సబిహితంబగు శబ్దంబు నట్లపోలె