పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/145

ఈ పుటను అచ్చుదిద్దలేదు

11. పూర్వ సంప్రదాయాలు వేదం శ్రుతి అనగా, వినబడినది. శతాబ్దాల పాటు, అది అనగా వినగా నిల్చిన దినుసు. దాని ఉచ్చారణ గురించిన జాగర్త పడవలిసిన అవసరం ఆదిలోనే కలిగింది. పద చ్యుతి కాదు, వర్ణ చ్యుతికుడా ఎక్కడా రాకుండా అర్ధస్ఫురణకి చాలా దోహదం చేసే ఉచ్చారణ చేసి చూసు గుని, వేదపదాల ప్రతి వర్ణానికీ ఒక స్వరం నిర్ణయించేశారు. అటు వంటి మేకుబందీ చెయ్యడంవల్ల వేగంలోని ప్రతి వర్ణమూ ' అక్షరం ' అయింది. ఋగ్వేదం పఠిస్తారు. అందుకు నాలుగు స్వరాలు వాడతారు — గానం శాస్త్రంలోని ప,ని, స,రి అనే స్వరాలు గానశాస్త్రంలో నాలుగు స్వరాల సంపుటి ఉండగలదుగాని, అయిదు స్వరాలకి తగ్గితే ' రాగం ' అనేది జనించదు. గానశాస్త్రంలో సంపూర్ణ, షాడవ, ఔడవ రాగాల రకాలు మాత్రమే గుర్తింపబడ్డాయి. సామవేదం పాడ తారు. అందులో ఇప్పటి గానశాస్త్ర స్వరాలన్నీ ఉంటాయి. కాని, వర్ణాల సందున వచ్చే మూలుగులన్నీ స్థిరపడి ఉండడంచేత, ఒకేసారి పదిమంది కలిసి సామం చెప్పినా, ఆ మూలుగులు స్వరాలన్నీ ఐక్యమై వినిపిస్తాయి – అనగా అర్ధంతో నిమిత్తంలేని కేవల నాదాన్ని కుడా స్వరపరి చేశా రన్నమాట. ఇంకా నొక్కి పలక వలిసిన వర్ణాల నందునపడి నలిగిపోగల వర్ణాల గురించి, అంత్యాన్ని వచ్చే వర్ణాల గురించి – ఇలాగ్గా ఎన్నెన్నో గురించి కాపుదలటం పెట్టి ఉండడంవల్లనే, ఎన్ని శతాబ్దాల పాటు ఎన్ని నోళ్ల పడి వచ్చినా, వేదనాదం చెక్కు చెదరకుండా, ఈషణ్మాత్రమైనా రూపవికారం చెందకుండా ప్రయాణం చేసి, తరువాత తరువాత లిపిలో వెలిసింది. వేదో చ్చారణనీ బట్టి అనుమానిస్తే, ప్రతి అక్ష రానికీ స్వరం స్ధాపించాలి, అక్షరాలమధ్య ఒక వేళ మూలిగితే అందుకు కుడా స్వరం నిర్ణయించి అంతా ఒకమాదిరిగానే ఆ సంద ర్భాలలో మూలగాలి. -