అ న తా లు 119 గానాన్నే చెయ్యగలిగి, లోకంలోని గాన పరివర్తననిబట్టి మారక, అభినయం మాత్రమే చెయ్యగలిగిన నటులు కుడా రంగంమీద మెప్పు పొందరు. 'ఆ దిక్కుమాలి పాతరకం పాటతో రంగం ఎవరెక్కమన్నా గయ్యా వీణీ!' అంటూ గానజ్ఞానులయినట్టు కొండరు సెలవిస్తారు. ఏమైతేః, వెనక తను ఆ పాటతోటే మెప్పుపొంది ఉండడంవల్ల, సంగీతనటుడు తన తప్పు తెలియక బాధపడతాడు. అటువంటి సంగీత నటుడు ఆ రంగంనించి నిష్క్రమించడమే కర్తవ్యం. అతడి గానశకం గతించడంవల్ల అతను అభినయానికి పనికిరాడు. మళ్ళీ, అతని గానా వికీ అర్ధం తెలియదు, కొత్తగానానికీ తెలియదు. కాని, పాతఫక్కీ రాగం వినగానే నవ్వొచ్చేస్తుంది. మరికొన్ని ఏళ్ళకి ప్రస్తుత గానాన్ని విని రాబోయేవాళ్లు తీసిపారేస్తారు. ఏళ్ళెందుకు! నిన్న పాడింది ఈ వేళ పాడుతూంటే, “పాడిం దేపాడుతున్నా" డని వస్తుందిగదా! సంగీత నాటకరంగంమీద, పద్యాలూ అట్లాగే ఉండగా, వాటి అర్ధభావ స్వారస్యాలూ అట్లానే ఉండగా, వాటివల్ల జనింపగల అభినయం అట్లానే ఉండగా, మార్పు ఎందులో వస్తుందో గమనించండి. అభి నయంలో మార్పువచ్చి అభివృద్ధి చెంచాలి గాని, అలంకరణకోసం తెచ్చాం అన్న రాగంమూలాన్ని రంగాభివృద్ధి నశించనా! పద్యగానా నికి మితి లేదు. ఒక విధమైన హద్దు అనగా తాళం ఉన్నప్పుడే డరీ అంచూ ఉండదు, ఆవృతాలకి మితి లేకపోవడంవల్ల. మితి లేని పద్య రాగానికి మార్పుకుడా ఉండాలంటారు ప్రదర్శనసభ్యులు. వాళ్ళనేమిటి అనేది! అసాధ్యకృతికి అడ్డంపడ్డ సంగీతనటుణ్ణి అనాలిగాని,
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/144
ఈ పుటను అచ్చుదిద్దలేదు