118 ఆంధ్ర నాటక పద్యపఠనం చేకూరుస్తాయి. విప్లవాలు ప్రకృతిసిద్ధాలు. అవసరం చొప్పున స హేతుక విప్లవాలు చాలు సంభవించవచ్చు. కాని సంగీతనాటకరంగం మీద మనకి 'ఉద్రేకం' దొరుకుతుందిగాని, 'యోచన' ఇంతవరకు మృగ్యం - వెలవ నే లేదు, విప్లవాలు విజృంభించడానికి 'ఉద్రేకం' మాత్రమే గల రంగాలు మరీ ఉచిత క్షేత్రాలు. అక్కడి విప్లవాలకి ప్రదర్శనసభ్యులే కర్తలు. ఏమంటే, వాళ్ల అభీష్టం తమాషారకం. వాళ్ళ ఉద్దేశం, సంగీతనటుడు తెగ పాటపాడి తిష్ఠ వేసి పాటకచేరీ చేస్తూకూచునే బాపతు కాకూ డదు. అంతమాత్రాన్ని మళ్లీ ఆనకట్టుపూర్వపు పాట, పాతకత్తు పాట, దేశవాళీ పాట, భాగోతాల్లో పాట, పురాణధోరణి పాట, మొదలై నవి దొర్లించకూడదు. పద్యంలో మాత్రమే, కాస్త రాగం, చక్కటిది, రసా నికి భంగంరానీకుండా అంటే మాకు సమృద్ధి, అని. అందువల్ల, కొత్త దే దేనా దొరుకుతుందేమో, కొత్త వింతగనక - రంగంమీంచి విసర వచ్చని సంగీతనటులు అన్వేషంలో ఉంటారు. అక్కణ్ణించి, ఎవ రైనా అరవాయన వచ్చి చేసిన ఆలాపనలూ ఎవడైనా గవాయి వచ్చి వేసిన సంగతులూ తంటాలుపడి పట్టు: గుని, ఆ అనుకరణం సభ వాళ్ళకి కానుకగా సంగీతనటుడు పద్యగానంలో ఇస్తే వాళ్ళు ఇంత మొహాలు చేసుకోడం జరుగుతుంది. ఆదిలో కంద గీత సీసాల్ని దరు వులుగా పాడేవాళ్ళు. కాలక్రమాన్ని ఆ తాళం గతించింది. ఇప్పుడు గీతాలు దరువు వెయ్యరు కాని హాస్యవ్యాపారంలో కంద గీతాల ఆఖరిపాదాలు దరువేసి కవ్విస్తూంటారు, 'సంసారముల బాసి సంపద లను రోసి... ' అనే పద్యం మొదట 'మట్టుగా' పాడబడేది, తర వాత వి శేష సంగతులు లేకుండా సంసారిపక్షంగా 'హిందూస్తానీతోడి' మీద పాడబడేది, ఇప్పు డౌనాటకం ఆడరుగాని, ఆడితే 'సింధుభైరవి' మీద పాడతారు, అక్కడక్కడ 'హ' కారం రానిచ్చి, 'హ' కారం లేందే 'హిం'దూస్తానీ వచ్చునని అవతలవాళ్ళు అనుకోరుట కాని, వెనకటి
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/143
ఈ పుటను అచ్చుదిద్దలేదు