పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/142

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనరాలు న ర్థా 117 నిస్టు రాకపోవడంచేత ప్రదర్శనం మానుకున్నారు. అన్ని శృతులమీద అన్ని గాత్రాలవాళ్లు ఒకే రాత్రి నాటక రంగమీదినించి వడ్డించిన రాగ సంగీతపు ధప్పళం ఆరగించడమా, కవి రచించిన నాటకం యొక్క పర మార్థం సభ్యమహాశయులు ఆనందించడమంటే నాదలోకంలో ప్రవే శించడానికి శృతి రాజమార్గం. గాయకుడు తన శృతిని పురస్కరించు గుని, తన ఆత్మకి పరిచిత మైన నాదమండలంలో విహరించడం సాగించి, శ్రోతల్ని కుడా విహరింప చెయ్యడానికి వస్తాడు. అతడు ఆయా నాద సీమలలో ఉండే చిత్రవిచిత్రాలు శ్రోతలకి వాయువేగంతో చూపిస్తూ, వాళ్లని మళ్లీ జాగర్త గా రాజమార్గంలో పడేస్తూంటాడు. అటువంటి మార్గం ఒకటి పెట్టుగోకపోతే అతనితో బయల్దేరే వాళ్లకి అగమ్య గోచ రంగా ఉండి ఐ ళ్లు బెదిరిపోతారు. కాబట్టే, శృతియొక్క ప్రాముఖ్యం గమనించి పాటకి పది నిమిషాలు పూర్వం శృతి చూసుగుంటూనే కూర్చుండే గాయకుల్ని ఎరుగుదుం. శృతి అంత ఉక్కృష్టం అన్నమాట. సంగీత నటుడి పద్య సంగీంతంలో శృతీలయామాత్రం ఉండవు అనిపించు గోవడమా, నటుడి కళ: రంగాన్ని ఏమో ఉద్దరిస్తుందని పద్యంలో ప్ర నవేశం ఇయ్యబడ్డ రాగం ఇల్లాగా నటుడికి మాటదక్కించడం ! నటుడు తన పనేమిటో తెలుసుగోలేక, తెలుసుకోగలిగినా చెయ్యక, తనది కాని వ్యాపారంలో ఇల్లా నోరు చేసుకోవడం ఏమి బావుకోవాలనో! ఇంకో ప్రమాదం. నాటకరంగం అనేది తత్కాల సంఘాన్నో లేక వివిధ మానవస్వభావాల్నో ప్రతిబింబిస్తూ ఉండాలి. అట్లా కాకుండా పద్యసంగీత నిర్బంధంవల్ల బయటి గౌనలోకంలో సంభ విస్తూండే మార్పుల్ని గంటల ప్రకారం సూచించే గడియారంలాగ తయారైంది నాటకరంగం. గానలోకంలో గలిగే మార్పులుకుడా విప్లవాలే —— ధనప్రాణనష్టం లేకపోతేం గనక ! ఉద్రేకంవల్ల మాత్ర మే పుట్టిన విప్లవా వాలు చేటు తెస్తాము. యోచనతో కూడినవి మేలు