116 ఆ ం ధ్ర నాటక పద్య పఠనం వాళ్లు జనించారు. మొదటి తంబురాలోంచి, చిన్న హార్మోనియం, తరవాత తొక్కుడు హార్మోనియం మెల్లిమెల్లిగా లోపల్నించి జరిగి పక్కనించి పాకి రంగంమీదికి వచ్చి, కొంతకాలానికి నువ్వా నేనా అన్నట్టు రంగానికి ముఖాముఖిగా డీక్కోడం ఎరుగున్న వ్యాపారమే. కాని, ఇటీవల అపశృతి తొలిగించేశారు. ఎల్లాగంటే శృతే తొలగించే శారు. శృతే లేనప్పుడు అపశృతి ఎల్లా బయల్దేరుతుందని వాళ్ల ధైర్యం. కాని శృతికి అనుగుణంగా ఉండవలసింది. గాత్రంగనక, గాత్రాలు అన్నీ శృతిలో ఉండే బాపతువి కావుగనక, వాళ్లు అపశృతి వారించ లేకపో యారు. కాని, అటువంటి అవాంతరం సంభవించినప్పుడు హార్మోని యం వాయించేవాళ్లల్లో గడసర్లు, తమకిగల చేతివేళ్లు పదింటికో నూ అందినన్ని మెట్లు ఏక కాలమందే నొక్కేసి, బర్రుమనిపించి ఆ అపశృతి గాత్ర రాగ సంగతులు భీషణనినాద ప్రవాహతరంగాలలో గొట్టుకుపోయే టట్టు చేస్తారు. అనగా, ప్రదర్శనమంటే : సంగీతనటుడి రాగం, అభిన యం కాక, హార్మోసిస్టు ఎంత చాతుర్యంతో రంగంమీంచి వచ్చేరా గాన్ని అనుసరిస్తూ వ్యవహరించగలడో గమనించి ఆనందించవలిసిన బాధ్యతకుడా సభవారు తమ మీద పెట్టుగున్నారు. ఒకే శృతి మోగు తూంటే అది సభ్యుల హృదయాన్ని పట్టుగుని, గాయకుడి గానం వాళ్లకి తన్మయత్వం తీసుకు రావచ్చు. కాబట్టే, గాయకులు తమరప్పు డప్పుడు పాడడం-మానినాశృతి మాననియ్యడు. చాలామంది హరిదా సులు వచనం అనేటప్పుడు కూడా శృతి మాననియ్యరు. శృతి మాన డం పాటకి మృతి, అవిచ్ఛిన్న స్వరసంపుటి గానం అవుతుందిగాని, మధ్య ఖాళీలుగల నాదఖండాలు గానానికి విరుగుడు. ఒక ప్పుడు, నటుడు పాడ వలసిన పద్యాన్ని మొదట హార్మోనిస్టు తనయంత్రంమీద అభినయించి అందించగా, అప్పుడు నటుడు పద్యం అందుకోడం జరుగుతూంటుంది. నటుడికి హార్మోసిస్టు J టకకర్తని బుంచిన దైవం. ఒకప్పుడు, హార్మో
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/141
ఈ పుటను అచ్చుదిద్దలేదు