114 ఆంధ్ర నాటక పద్యపఠనం వెళ్ళడం పొ పాటు, ఏకుంటే: కానం అవ్యక్తంగనక, నచ్చి ఒకణ్ణి పో పొ. ఆకర్షిస్తే వాడికి బ్రహ్మానందం కలిగిస్తుంది. నచ్చదా, ఛీ అనిపించి లేచిపోబుద్ధి వేస్తుంది. అనగా, గానంలో మధ్యేమధ్యే పానీయాలు లేవు. ఒడి గానం నిమిత్తమే ప్రదర్శనానికి వెళ్ళే సభ్యుడు, తప్పని సరిగా కొన్ని యిత: కంఠాలు వినవలిసిఉంటుంది. గానానికి ఒంటెత్తు గుణం ఉండడంవల్ల, ఆ సభ్యుడికి ఏ యితరకంఠమూ అప్పట్లో నచ్చదు. అనగా, అతడికి ఇతరుల పాట కేకలో బొబ్బలో అన్నట్టు తోస్తుంది. తన అభ్యర్ధిగానంతో పోల్చి చూస్తే! అటువంటి సమయాల్లో ఆ సభ్యుడు అల్లరీ కూతలూ మొదలెట్టి తను జీవించి ఉన్నట్టు దాఖలా చూపించేస్తాడు. చేతిసొమ్ము పెట్టుకుని నిద్దర మానుకుని ప్రదర్శనానికి వచ్చిన ఆ మహాశయుడు ఏమి చెయ్యడానికి తగడు గనక! తనకి నచ్చని ఇతరగానాలు జరిగేటప్పుడు, 'చాల్చాలు, నడు, బళాబళీ, అవునవును, అబ్బా, ఒన్, అల్లానా, దిగుదిగు' అని అరుపులూ, చెవులు గింగురెత్తే ఈలలూ ఈందరువులూ, రకరకాల జంతుధ్వనులూ, చప్పట్లూ, తాళాలూ ప్రారంభిస్తాడు. ఆయన హృదయంలో ఉన్నది ఆయన ప్రకటిస్తున్నాడుగనక ఆయనవల్ల దోషం ఏమీ లేదు. అయినా కొందరు గొప్ప వాళ్ళు ఇల్లా అల్లరి చేసేవాళ్ళని గదమా యించాలని వ్యర్థంగా ప్రయత్నిస్తారు గానశ్లాఘ ఎలాగో గాన నిర సనకుడా అల్లాగే తక్షణజనకం అని మరిచిపోయి ! కాని, సాధార ణంగా ఒక్కొక్క సమాజంలో చాలా రాగాల పాటగాడు ఒకడే. ఎన్ని ప్రదర్శనాల్లో రాజు వేషం వేసినా అతడే. మరోడు రాజు వేషం తయారై వస్తే జనానికి నచ్చదూ ! వాడికి ఆకంఠం ఉండద్దూ! కంఠం తయారుచెయ్యుడం ఎల్లా? అందుకని అతడే హరిశ్చంద్రుడూ, నలుడూ, రాముడూ, సత్యవంతుడూ, అర్జునుడూ అన్నీ వెయ్యవలిసి రావడంలో, ఇతర చిక్కులుండేవి. వరసని అతడు పై పాత్రలు
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/139
ఈ పుటను అచ్చుదిద్దలేదు