పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/138

ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 0 113 వల్ల అనర్ధక చేష్టలూ బయల్దేరగా వాటి మిశ్రణాన్ని ' అభినయకళ * అని వాదించే రసజ్ఞులు ఉంటారా ? వాడికి ఎంత మరిన్నీ, ఒకే సంగీతనాటక సమాజంలో కిర్రుగా పాడేవాళ్లు అనగా, వీలైనంత గబగబా గాత్రం తిప్పి గిరికీలు కొడుతూ గుక్క పట్టి రాగాలు పెట్టగలవాళ్లు) ఆపేమంది ఉండరు. ఇద్దరో ముగ్గురో ఉండవచ్చు. ఉన్నా వాళ్లల్లో ఒకడుమాత్రమే ఒక ప్రదర్శనంలో దర్శనం ఇస్తాడు. ఏముంటే, రాగపాటలో తనతో సమానఫాయలో ఉండే మరొకడు రాజై రంగం ఎక్కితే, ఆ రాజుగాడి కున్నన్ని పద్యాలులేని పాత్ర తను ధరించి తన రాగాలాపప్రజ్ఞ కాస్తా ప్రకటించుకోడాని కేనా వీల్లేని దోనులో చిక్కడి వన్నుమోర్ 'కి దూరమైపోవలిసిన గస్థి తిలో పడడానికి ఆ ఒకడు ఎలా అంగీకరిస్తాడూ! అది శిరచ్ఛేదం ! అతను ఎక్కడ ఏం వేషా లేనా ఏం వేపా లేనా వేస్తాడుగాని రంగం మీద చిల్లరి చేషాలు వెయ్యడు ' రాగం షమాయించి అయిదుశృతి విూద విసి రేవాడికి చిల్లరి వేషాలు వెయ్యడం కర్మం ఏమిటి ? ' అని అతడి అభిప్రాయం. రాగాలు తియ్యలేని ఘటానికి రాజు వేషం యియ్యడం ఎంత ఘోరమో రాగాలు తియ్యగల వాడికి రాజు కాసి వేషం యియ్యడం కూడా అంత ఘోరమే అనేటట్టు వచ్చింది. అందుకనే జనం ఒక్కొ క్కణ్ణి గురించి, 'చాలా బాగా పాడతాడ్రా, ఉత్తమంత్రి వేషం ఇచ్చా రేమిటి?' అని దుఖిస్తూండేవారు. అక్కణ్ణించి, చాలా పద్యాలు గల పాత్ర వేషం తనకి నచ్చిన రాగాలు పాడగలవాడుకట్టినప్పుడే ఎవడైనా సభ్యుడు ప్రదర్శనానికి వెళ్ళడమూ, లేకపోతే మానుతూండడమూ జరిగింది. దాన్తో సమాజంలోని ముచ్చ కాయిముగ్గురు రాగ పాటకులకీ పైకి హెచ్చరికలూ నవ్వులూ దొర్లినా లోపలమాత్రం అసూయలూ తెగుళ్ళూ పుడుతూండేవి.. అసలు ఒక ప్రత్యేకవ్యక్తి యొక్క గానం తనకి నచ్చుతుందిగదా అని ఎవడేనా సభ్యుడు నాటక ప్రదర్శనానికి 15