11% ఆంధ్ర నాటక పద్యపఠన రి పైగా, గానం చేసేటప్పుడు ' తోం, తరన, తదరినన, శ్రీ' మొద లైన ముక్కలు అంటూండడమూ, పెదిమి విరవడమూ, ముఖం వికా రంగా పెట్టడమూ, కళ్లు మూసుకోడమూ, తల రుబ్బడమూ, శరీరం ఊపడమూ, కుడిచేత్తో సున్నాలు చుట్టడమూ, ఎడంచేత్తో ఎడం చెవి మూసు గోడమూ, భుజాలు ఎగర వెయ్యడమూ మొదలైన చేష్టలు పుడుతూంటాయి. ఇవన్నీ గాని వీటిలో కొన్ని గాని చెయ్యాలని గాయ కుడి ఉద్దేశం కాదు. అతడికి అవగాహన లేకుండానే గానం అతడిచేత అల్లాంటివి చెయిస్తుంది. ఆకారం లేనిదానికి గాలికి క్షణికాకారం క్షణ క్షణమూ ఇచ్చే గాయకుడి విషయంలో అటువంటివి మనం గణించనే గణించం. అదీకాక, మనం గానం కళ్లతో వినం, పాముల్లాగ ! చెవ లతో వింటాం! కాబట్టి, అతడి గానం మనల్ని ఆకర్షించేటప్పుడు, మనకి ఏ చేష్టలూ కనపడవ్. కాని కొంత కొంత మంది గానం కళ్లతో వినేటట్టు తోస్తుంది. అట్లా విని వచ్చి, 'ఏమిటండీ ' ఏమిటండీ పెద్ద పాటగాడ న్నారూ? ఒక టే తిప్పడం ఒళ్లు గానుగలాగ ! మూతి మట్టుకు ఎంత అసహ్యంగా పెట్టాడనుకున్నారు!' అంటారు. అనగా, వాళ్లు గానాన్ని చూడడానికి యత్నించారుగాని, వినడానికి కాదు. నాదోచ్చారణ చేసే టప్పుడు ఏదో ఒక విధమైన చేష్ట ఉండకమానదు, గానానికి అర్ధం మనకెట్లా గోచరించదో అట్లాగే గానంవల్ల పుట్టే చేష్టలకీ గోచరించదు. అల్లాంటి చేష్టలు అర్ధప్రాధాన్యం లేని పాటకచేరీలలో గమనిస్తూంటాం. అసలు అప్పుడు మనం గానరసంలో లీనమై ఉంటాం గనక, అవి మనకి తట్టనే తట్టవు. కాని నాటకం దృశ్యకావ్యంగదా! రూపాలూ చేష్టలూ చూడాలి అని కూడానూ మనం నాటక ప్రదర్శనానికి వెళ్లడం. కాబట్టి, చేష్టా ప్రాధాన్యంగల నాటకరంగంమీద సహజగమనంతో పఠింపతగ్గ పద్యాన్ని ఏ అల్పరాగంతో ఈడవదల్చినా, అవర్ధక చేష్టలు కొన్నేనా జనించక మానవు. పద్యంవల్ల సార్థక చేష్టలూ రాగం
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/137
ఈ పుటను అచ్చుదిద్దలేదు