పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/135

ఈ పుటను అచ్చుదిద్దలేదు

110 ఆంధ్ర నాటక పద్య పఠన్నం 'చక్కని రాజమార్గము' కృతిలో ముక్కలూ ఖరహరప్రియరాగం పేరూ నేర్చినవాడు ఇతరులదగ్గిర పాడడానికి అర్హుడే ! ఇది కాక, నాద సౌఖ్యం కల్పించి రచించవలిసిన సందర్భాలూ, తరుణాలూ, అవసరాలూ గమ నింపులేని కవులు హాస్యాస్పదు లవుతారు. అటువంటివారి 'పద్యం' పాడడమే జరిగిందా పకపకా నవ్వేవస్తుంది – ' నరులార తరులార గిరులార సురలార...' మోస్తరుది. అప్పుడు రసిక సభ్యులు కవి తన పాడిత్యం చూపించి తమర్ని డబాయించడానికి ఆ ముక్కలు దొర్లిం చాడని అభిప్రాయపడి ‘కొయ్, కొయ్' అని కేక లేస్తూంటారు. నాటకమే అదీ ? పద్యానికి రాగం జోడించవలిసిన ఆచారం ధర్మమా అని సం గీత నటుడి జ్ఞాపకశక్తి యావత్తూ రాగంమీదే ఆధార పడుతోంది. తన నాటకపుస్తకంలో తన పాత్రకి ఉన్న పద్యం పక్క, 'తోడి, ' 'భైరవి,' ' ధన్యాసి' మొదలైనవి రాసుకోవడం నటుడి అల వాటు. 'తోడి' అను పేరెట్టిన పద్యాన్ని అతడు తోడిమీదే కంఠపాఠం చేస్తాడు. మరో రాగంమీద ఆ పద్యం అతడికి జ్ఞాపకమే రాకపోవచ్చు, ఒక వేళ జ్ఞాపకంవచ్చి ప్రారంభించి మధ్య ఎక్కడేనా మరిచిపోతే, వాడు గొంతిగలో తోడి గొణుక్కుంటేనే కాని తరువాత ముక్క స్మరణలో పడదు. ఇందులో ఉండే విశేషం ఏమిటంటే: 'తోడి' రాగం అసలు ఎవరికేనా రావాలిగాని, వచ్చింతరువాత అది మరిచిపోవడం ఉఁడదు. బోధపడడానికి పదార్థం ఏమీ లేకపోబట్టి, మరిచిపోడానికీ ఏమీ ఉండదు. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో సంగీతనటుడు తను పద్యాన్ని ఉద్ధరించడానికి తెచ్చిన 'తోడి' రాగంతో తయారుగా ఉంటాడేగాని, ఏ పద్యాన్ని గురించి 'తోడి' తెచ్చాడో ఆ పద్యంలోని ముక్కలు మరిచిపోతూంటాడు. అందువల్ల అతడికి అక్కడి ముక్కలు మరి