పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/133

ఈ పుటను అచ్చుదిద్దలేదు

108 ఆ ం ధ్ర నాటక పథ్యపఠనం ఆ గానం ఎట్లా ఉంటుందో! అటువంటి అర్ధంతో జోక్యం లేకపోవడం అనే విషయం మనం గానవిశారదుడిదగ్గర గణించంగాని, కూను రాగాలు తీసేవాడిదగ్గి రా, కొంత బోధించడానికి వచ్చినవాడి దగ్గిరా, కొంత వృత్తాంతం చెప్పడానికి వచ్చినవాడిదగ్గిరా, తన వ్యక్తిత్వం మాటుపరుచుగుని అన్యవ్య క్తిలాఒప్పడానికి రంగం ఎక్కిన వాడిదగ్గిరా ఎంతమాత్రమూ క్షమించం. అందుచేతనే, పాఠాలు చెప్పడానికి వచ్చినవంతులు రాగధోరణిని మొదలెడితే 'అయ్యా! మమ్మల్ని చంపక చెప్పే దేమిటో చెప్పు, మహప్రభో' అనవలిసుంటుంది. అల్లాగే, ఉప న్యాసకుడు వచ్చి రాగా లెడుతూ నుంచుంటే, 'సంగతేమిటి, బాబూ, మమ్మల్ని తినేస్తున్నావు' అనవలిసివస్తుంది. సంగీతనటుణ్ణికుడా, 'మమ్మల్ని కోపంలో పడండంటున్నావు, ఎందుకో చెప్పవయ్యా, దీర్ఘాలు తీస్తూ కూచోక ? అనిగాని, 'విచారం తాడి ప్రమాణంలో వస్తూన్నట్టున్నావు. పాదానికి ఓ రాగం చొప్పున పిరాయిస్తున్నాను, చూడండి నా తడాఖా అనక, ఏమి కొంప ములిగిందో చెప్పి మరీ అహోరించవయ్యా' అనవలిసి ఉంటుంది. వ్రాతప్రచారం లేనప్పుడూ అచ్చుయంత్రాలు రానప్పుడూ నటుడు చెప్పే పదాల్లో ఏవి పూర్వరచితాలో ఏవి తక్షణకల్పితాలో చెప్పడం సాధ్యం కాకపోయి ఉండవచ్చు. కాని, అచ్చు సామాన్యవ్యా పారమైన ఈ రోజుల్లో, ఆ విభజన చెయ్యవచ్చు. కాని, ప్రదర్శనానికి పూర్వమే ఎవరైనా ఆ నాటక గ్రంధం చదివి ఉండాలి. నాటికకర్త ఆ గ్రంధంలో అందిచ్చినది నటులు ఎట్లా ప్రదర్శిస్తారో, కల్పించిన అవస్థలు ఆంతర్యంలోకి పట్టించుగుని ఎలా ప్రకటిస్తారో గమనించాలనే కుతూ హలంతోగదా నాటక ప్రదర్శనానికి వెళ్లడం. నాటకకర్త పదాలలో చెప్పలేని వ్యాపారం ప్రదర్శన మొత్తం రచనే చెయ్యడు. మట్లూ, టప్పాలూ, టుమ్రోణా అతడు పాత్రధారుల్ని ఉద్దేశించి రచించాలి