' ఏమిటీ ఆ అ న Во లు 107 నంలో కొంచెం కాదు, చాలా తెలియక పోవడం కనిపిస్తుంది. అర్థంకానిది మిక్కిలిగా కనిపించి ఆకర్షించేటప్పుడు, అందులో ఏదో మహత్తు ఉంది మనకి తెలియదు—అని మనకి అనిపిస్తుంది. సంగీతనటుడి విషయంలో అర్ధంలేని గిరికీలూ ! ' అనిపిస్తుంది. చాలామందిని చంపిన వాడు వీరుడుకాగా ఒకణ్ణి మాత్రమే చంపినవాడు హంతకుడై నట్టు. గాయకుడి నాదంలో అర్ధం లేకపోవడాన్ని మనం క్షమించేస్తాం. అతడి నాదంలో అర్థం మనం వెతగనే వెతగం, అందుకోసం అతడిదగ్గిరికి వెళ్ళనే వెళ్ళం. ఈ సంగతి విస్మరించి కొందరు తమాషాగా మాట్లాడు తూంటారు – ' ఇంగ్లీ షులో గానం ఉందీ అసలూ ! ఆ కూతలే వాళ్ళ గానం: నాకు అదేమీ బోధపడదండీ, మన 'కళ్యాణీ' మన 'లతాంగీ' బోధపడ్డట్టూ! అని. కాని, కళ్యాణీ లతాంగీమాత్రం బోధపడ తాయా? ఎవరి కళ్యాణీ లతాంగీకుడా ఎవరికీ బోధపడని దినుసే. ఆన వాలుపట్టడం అనేది బోధపడడం కానేరదు. అయినాసరే 'హహ హహై' అంటూ లేచిపోతూ ఏమిటా హిందుస్తానీ గానం ? దీర్ఘాల్తో సాగదీస్తూ ఒకరకంగా పడిపోతూ వణుకుతూ అ స్తమించే గానం, ఏమి టాఇంగ్లీ షుగానం ఏం బాగుంటుందీ?' అనే అభిప్రాయాలు వినబడు తూంటాయి. కాని, ఎవరి గానం వారిది. హైందవుల గానం కేవలం కసర త్తని ఆంగ్లేయుల అభిప్రాయం (Ancient India-Vol. IIBose) గాన భాష స్వరాలు. స్వరాన్ని భాషాంతరీకరణం చెయ్యడం అసాధ్య కృత్యం. పద్యం పదాలలో ఉంటుంది గనక, కొంతవరకు కాకపోతే కొంతవర కేనా భాషాంతరీకరణం చెయ్యవచ్చు. అందుకనే ఇంగ్లీషు రాని వాళ్ళు : 'ఇంగ్లీషువాళ్ళకి కవిత్వం ఉందండీ!' < అనిగాని, అని. ఇంగ్లీషు కవిత్వం నాకు బోధపడదండీ ! " అనిగాని అనరు. ఏమంటే, మీ కాభాష రాదేమోనండి.' అని ఎవరేనా అనగలు అట్లాగే, ఇంగ్లీషు గానంయొక్క స్వరభాష నేర్చి అప్పుడు గమనించాలి.
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/132
ఈ పుటను అచ్చుదిద్దలేదు