106 అ ం ధ్ర నాటక పద్య పఠన ల కొండరు గానాన్ని అపవిత్రపరచడం ఎరుగుడుం. అందుక నే భక్తి లేని గోనం వ్యర్ధం అనడం. ఆటువంటప్పుడు, క్షుద్రరాగాలు ! క్షుద్ర రాగాలుమాత్రమే విసరగలిగి, అదివరకే గుణశీలాలు పోగొట్టుకున్నా మంచిగాత్రంమూలంగా నటవృత్తిలో పడి నటప్రతిష్ఠ కుంగదీసిన వాళ్ళని చాలామందిని ఎరుగుదుం. ఎవడిదగ్గిరేనా అల్పకళ ఉండడం అమాయిక సంఘానికి అపాయకరం. అల్పరాగమాత్రుడైన సంగీత నటుడి రాగసంపత్తి మూర్ఖజనామోదం ఆర్జించడానికిన్నీ శృంగార వ్యాపారాలు సాధించడానికిన్నీ ఉపచరిస్తుందనేమాట మిగిలిపోయింది. 'కొంచెం మ్యూజిక్ విసురుదాం' అనే గిరీశాలు ఉండగలరు. ఎలాగో పద్యాలు అల్లడం నేర్చుకుని ప్రేమజాబులు రాసి తద్వారా తమరి ఆక ర్షణ ఇనుమడిస్తుందని నమ్మేవాళ్ళుండగలరు. ప్రకృతిదృశ్యాల ఛాయా పటాలు తియ్యడంబదులు, ఆ విషయంలో క్షుద్రప్రజ్ఞకలవాడు శరీర భాగాలు వేర్వేరు వ్యక్తులవి తీసి అతికించి పని సాధించడం ఎరుగుదుం. కాబట్టి జనం సంగీత నటుడిలో కోరి మెప్పులు కురిపించే అల్ప రాగకళ తమరికే హానికరం. అది సంగీతనటుడికి ఎంత వ్యర్ధమో అతడు రంగం నించి నిష్క్రమించగానే తెలుస్తుంది. అప్పుడు మరొక ప్రజ్ఞవల్ల గాని అతడు జీవించలేడు. మరొక ప్రజ్ఞ లేకపోతే, అప్పుడు బతిగీ చచ్చే ఉంటాడు, మరణించగానే, బతిగాడు రా పాపం ! అంటారు. పద్యం పాడుతూ సంగీతనటు డిచ్చే రాగానికీ, గాయకుడు చేసే గానానికీ భేదం ఉంది, పద్యంలో ఒక విధమైన నడక ఉంటుంది. కాని సాధారణ పద్యరాగుడు నడక పాటించడు. అనేసిన ముక్కలు మరో సారీ ఇంకోసారీ దొరకపుచ్చుకుని ఆవృతాల్లో విజృంభించడానికీ అత నికి హక్కు లేదు, వీలు లేదు, పైగా స్థాయి లేదు. అందువల్ల పద్యం రాగించేటప్పుడు తెలియడంతో పాటు కొంచెం కొంచెం తెలియకపోవ డంకుడా ఉంటుంది. రసంమాట అల్లాఉంచగా! కాని, గాయకుడి గా
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/131
ఈ పుటను అచ్చుదిద్దలేదు