12 105 పద్యాన్ని అవగాహన చేసుగున్నా డనుకుందాం ! అల్లాగే చేసిఉంటే, తను పద్యాసారస్యం గ్రహించిన రీతి యేమిటి, నాటక శ్రోతల నిమిత్తం తను అవలంబించే రీతి యేమిటి? ఒక పద్యం తన హృదయంలో ప్రవే శించడానికి ఒక రీతిన్నీ ఆ పద్యమే తక్కిన హృదయాల్లో ప్రవేశించ డానికి మరో రీతీనా ? కవి పద్యంలోని పదాలవల్ల మాత్రమే తనలో జనించే చతుర్విధాభినయమే సార్ధకం అని నటుడికి గ్రహింపులేదా? అదే కదా తన కళ. అది ఇంకా రంజుగా ఉంటుందని ఎవరో అన్నా రని మరో కళలో తను చొరబడి రాగం తెచ్చి కంఠానికి ఉరిపోసుగుని తన కళకీ శూన్యం పెట్టుగుని, అన్యుడవడంవల్ల సమగ్రతకివీల్లేక గానానికీ తలవంపు తీసుగు రావడం ఎందుకొచ్చిందీ ? అనవసరం మాటఅట్లా ఉండగా, ప్రతికూలంగా పరిణమించే తన రాగకళ సందర్భం లేనప్పుడు బలిమిని జొనిపి ప్రకటించుగోడం తన కేంలాభం ! కొందరు నటులు 'సభవారు అల్లా కోరతారు' అంటారు. లోకువఇస్తే సభవారు ఏమైనా కోరతారు. నాటక సభవారిలో అస్పృహులూ అజ్ఞానులూ అధిక సంఖ్యాకులు. తనకళ ఏముటో గుర్తెరగకుండా వ్యవహరించినంత కాలం, సభ వారు అతణ్ణి ముక్కుకి తాడోసి ఈడుస్తారు, తమ ఆధిక్యం స్థాపిఁ చు గుంటారు, తమ సొమ్ముకి కిట్టుబాటుకోసం జంతుధ్వనులన్నీ చేసేస్తారు. పద్యతత్వం తెలుసుగుని పద్యపఠనం చేసి, అభినయించడం బదులు, ఏశృతో పెట్టుగుని తద్రరాగం తీసినన్నాళ్లు. ' నటనం' ప్రత్యేక కళ కానూకాదు, దానికి మన్ననా ఉండదు సరికదా, నటుడిమీద సవారీ చెయ్యని ప్రేక్షక మహాశయుడుండడు, అందుకే గావును నాటక ప్రదర్శ నానికి వెళ్లేది అని అతడి సంకల్పం ! లలితకళలు బ్రహ్మవిద్యలు. గానం ఉత్తమో త్తమం. గానం చాలా అభివృద్ధి చెందించునున్న వాడికే దాని తత్వమూ ఉద్దేశమూ బోధపడతాయి. అల్లా' బోధపడినవాళ్లే అని జనం ఎంచేవాళ్ళుకూడా 14
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/130
ఈ పుటను అచ్చుదిద్దలేదు