104 ఆంధ్ర నాటక పద్యపఠనం కొంత కొంత మెతX అంటూ ఉంటే తప్ప ప్రపంచంలో చాలా పేచీలు సాగనే సాగవు. ఒంటి చేతి చప్పట్టుండదు. ఒక కవి రచించిన పద్యాన్ని లిఖితరూపంలో మనం మొదటి సారి చూడడం తటస్థించగానే, అదేమొటో తెలుసుగోడానికి మనం పాట ప్రారఁభించఁగదా ! పద్యరూపంలో మనకి కవిత్వం దొరుకుతుం దని పుట్టెడాసతో ఉంటాం. ఒక్కొక్కప్పుడు మన ఆశ నిరాశ అయి పోయి అందులో చెత్తాచెదారమూ ఉండవచ్చు. అటువంటి ఘటాన్ని మనం 'కవిత్వం' అని పిలవడానికి, తటపటాయించాలి. మరి పద్యంలో కవిత్వం ఉందో లేదో తెలుసుగోవడం ఎట్లా ? మన తాలూకు కూను రాగమా అందుకు తోడ్పడేది! రచయిత యొక్క పద్య పేటికలో కవితా ధనం ఏముందో అని 'తెరవడానికి మన క్షుద్ర రాగమా తాళం చెవి ? పధ్యంయొక్క అర్ధం, భావం, భావన, సహజత్వం, నాదం, నడక, అలం కారం, ధ్వని, ఔచిత్యం, సంప్రదాయం, రీతి, శయ్య - ఇల్లాగ్గా ఎన్నో గుణాల్లో ఏ కొన్నో అందులో ఉండడంనించికదా మనం దానివల్ల ఆకర్షింపబడడం ? అటువంటి లక్షణాలు ఏమాత్రమూ గమనించక, క-చ—సీ—మ, లాంటి గుర్తులవల్ల ఆ రూపం గద్య కాదని మాత్రం తెలుసుగుని, వెంటనే తమ స్టాకులో ఉన్న బంజరు రాగనికి కళ్లెంవదిలి విహరిస్తూ, ఆ దెబ్బతో అది తమరు సంపూర్ణంగా ఆస్వాదించేసినట్టు మురుస్తూ, ఆ కవిత్వం గురించిన యోగ్యతాపత్రంకుడా వెంటనే యియ్య గల తెలుగువాళ్ల విచక్షణ మెచ్చతగ్గదిలా కనిపించదు. అయినా సరే చాలామంది మరొకరి సీసపద్యం వంటి దాని కేసి చూస్తూండడం, తమరు యధాశక్తి మూలుగుకుంటూ ఉండడం, ఎదటి పద్యాన్ని మెచ్చుకోడం -తమకి చాలా రుచించే తమరి గానంయొక్క సంపర్కం దానికి తగల డం వల్ల, వెంటనే దానికి యోగం పట్టి సీసం బంగారంలాగ మారుతుంది గావును! ఆ మోస్తరుగా కాకుండా, సక్రమపద్ధతినే ఒక నటుడు
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/129
ఈ పుటను అచ్చుదిద్దలేదు