పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/128

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన కాలు 103 అతడు రొండు దాపెట్టుఁగుఁ, పద్యఁనించి రాగం తొలిగిపోయిన నాడు, ఇప్పటిలాగ సత్యవంతుడు స్వంతరక్తి కట్టించుగోలేదు, తన రంగంలో వచ్చే పాత్రధారులంతా యధారీతిగా అభినయిస్తే తప్పు. అప్పుడు, ఎవళ్ల పని వాళ్లు చెయ్యాలి. కాబోలు, లేకపోతే ప్రదర్శన ప్రపంచం నడవదు గావును అనే గ్రహింపు కలుగుతుంది. ఆ రాత్రి మొత్తానికి తన వేషం ఒక్కటే మెప్పు పొందే లాగ, కొందరు రాజు వేషగాళ్లు తక్కినవాళ్ల శృతి వగైరాలల్లో మార్పులు లోపాయికారీగా చెయించి వాళ్ల యత్నాలు ధ్వంసం చెయించడం ఎరుగుదుం. కాలక్రమాన్ని ప్రస్తుత సంగీతనటుడి ఆయు దౌయ మంతా హార్మోనియంలో ఇమిడిపోయింది. ప్రాణాలు హార్మోనియంమీదా, మరో రొండు తబలా ఒంటి ప్రాణంతో రంగంమీద నుంచుంటాడు. అతడికి హార్మోనియమే మార్గదర్శి. అతడు శృతిలోగాని ఏడవడు, శృతిలోగాని నవ్వడు, కోప్ప డడు, శపథం చెయ్యడు, శరణివ్వడు, చావడు గొప్పపని ఏదీ చెయ్యడు. పాపం, అతడి తప్పేమిటి ? సభవాళ్ల ఉద్దేశంలో చెయ్యకూడదుట, వాళ్ల తప్పుమాత్రం ఏమిటీ ? అట్లాంటి అభిరుచి, వాళ్లకి సంగీతనటుల మూలాన్నే సంక్రమించిందిట, అది వాళ్లు మరిగారట ! శృతి బనా యి యిస్తే తప్ప రసమూ ఉప్పొంగదుట, హుషారూ రేకెత్తదుట! కవి అదృశ్యుడై ఉండడమూ, పద్యం యొక్క అర్ధభావాలు ప్రదర్శకులకీ శ్రోతలకీ కుడా అక్కర్లేక పోవడమూ సంభవించినప్పుడు ఇతరులు నోరు విప్పడం నోరు చేసుకోవడం అవుతుంది. హోటల్లో శుచిలాగే! వడ్డించే వాళ్లకి శుచి ఉండదుగనక, తమరు శుచి పాటించడం లేదని తినేవాళ్లు ! తినేవాళ్లకి శుచి ఉండదు గనక, తమరు శుచి పాటించడంలేదని వడ్డించే వాళ్లు! యజమాని ఎల్లాగూ అదృష్టవంతుడు గనక అదృశ్యు డై ఉంటాడు. రెండు పక్షాలంటూ ఉండి, రెండింటిలోనూ విడివిడిగా