పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/126

ఈ పుటను అచ్చుదిద్దలేదు

101 Y Per లు గలవు. అనగా పూర్వదోషాలు మటుమాయం కావు సరిగదా, నటుడి రాగదోషాలు వాటిని చేరతాయి. వీటిని అభినయ దోషాలు కలుస్తాయి. అందువల్ల పద్యారాగాభినయం అనే ముప్పేట కళ ప్రదర్శించే సంగీత నటుడికి, ముమ్మరమైన గుణశ్లాఘకంటె ముమ్మాటికీ దోష నిరసన దక్కి తీరుతుంది. అతను చేసే అభినయం పద్యం మూలంగా కొండ వరకు అర్ధవంతమూ రాగంమూలంగా కొంతవరకు అర్ధశూన్యమూ అయి ఉండడంవల్ల! అది కాక, నాటక రంగ రాగకల్లోలం ఎన్నో అల్లర్లకి కారణం. రాజు వేషం సంగీతనటుడు, తన రాగప్రజ్ఞ చాలా తడవలు ప్రక టించుగోవచ్చు,—అతడి పాత్రకి చాలా పద్యాలు రచింపబడి ఉండడం వల్ల. అందువల్లే, కొన్నింటి ప్రకటన పాడుగా ఉన్నా, మరికొన్నింటి కేనా ' వన్సుమోర్' కొట్టించుకోవచ్చు, మొత్తంమీద గండం గడు పుగోవచ్చు. కడమ వేషాలకి ఎప్పుడో వస్తుంది పద్యం తోకచుక్క లాగ ! అది కాస్తా శృతిలో ఉండకపోతుంది. బ్యాడ్ మింటన్ ఆటలో, 'సెంటరు' లాగ రాజుంటే, ' ఫ్రంటు' ల లాగ తక్కిన వాళ్లుంటారు. వాళ్లకి ఎప్పుడో గాని ' పోయింటు' రామ, అ ఒకటీ చెడిపోవచ్చు. అంతా అతణ్ణి తిడతారు. సెంటరు' వాడు చాలా యత్నాలల్లో వీగిపోయినా, కొన్నింటిలో మెప్పు లాగవచ్చు గనక వాడి సంగతి తోసుగుపోతుంది. తక్కిన వాళ్లు ఒక వేళ్లు శృతిలో ఉన్నా వాళ్లని ఆట్టే ప్రజ్ఞ చూపనియ్యకు. వాణ్ణి వీలై నంత త్వరగా అయిందనిపించి లేవదీ నేస్తారు — ఉపనయనంలో వటువుని అన్నందగ్గర్నించి అర్ధకుసిగా లేవదీసినట్టు. ఈ సంగతి ఇట్లా ఉండగా, కొందరు రాజు వేషగాళ్లు, తమరు రంగంమీద ఉంటూన్న సమయంలో, తమ సమక్షంలో, నందు దొరక పుచ్చుగుని తమరి కంటె అధికగానం చేసి మెప్పు లాగేస్తా రేమోకదా అది తమకి నామర్దా కదా అనే భయం చొప్పున, పక్క వేషాలకి కవి రాసిన పద్యాలు తీ సెయిస్తారు- కోరలు తీయించేసి