అనరాలు 99 ఉం టే! ఉండాలికుడానూ. ఎందుకంటే, ఆ గానరూపం మళ్లీ దొరకదు గనక, గానం కాలనిగళబద్ధం గనక. ఒకడు ఒక పాటలో ఒక చోట వేసిన సంగతులు పసందుగా మనకి తోచిన సంగతి మర్నాడు అతడితో మనం చెప్పడానికి వీలుండదు. అందుకని, రాజయ్య రంగంమీదికి ఏ ఉద్దేశంతో టిటరానీండి, అతడు గాత్రంవిప్పేసరికి అది సభవారికి రుచి స్తే తక్షణం మెచ్చేస్తారు, నచ్చకపోతే కూనేసి మోసేస్తారు. కొందరు కుశాగ్రబుద్ధులు అన్నారు: సభవారు మెచ్చుగునేది రాజయ్య సంగీతం కాదు భీముడి గానమే అన్నారు. అనగా, వాళ్ల నమ్మకం, భీముడికి--- అట్లాగే రాజులైన హరిశ్చంద్రుడూ నలుడూ మొదలై నవాళ్ల కి ఓ కాసిని రాగాలు ఎందుకు వచ్చిఉండకూడదూ? అని. వచ్చి ఉండచ్చు. తమ ఎదటభీముడు లేడు. లేనిభీముడి ప్రజ్ఞలు చాలా ఉండ వచ్చును. భీమగానంఅని మనంవిన లేదుగాని, భీమ పాకంఅని వింటూంటాం. రాజయ్య మన కాసంగతి రుచి చూపిస్తే, పద్య అర్ధ భావ అభినయాలకి భంగం రానీకుండా! అందుచేత, భీముడికి రాగాలు వచ్చిఉండవచ్చు ననడం, 'ఆలులేదు చూలులేదు, కొడుకు పేరు సోమలింగం' అనడమే. క్షుద్రరాగం తొడగడం మూలాన్ని చచ్చుపద్యాలు రచ్చకె క్కడమేకాక, పద్యమణులు అక్రమంగా వీధిని పడుతున్నాయి. నటుడు ప్రపంచంలోని మానవుల్లో ఒక్కొక్కరిని లేకపోతే ఒక్కొక్కమాది రిని అనుకరిస్తే, ఒక్కొక్క నటుణ్ణి వేలకొలది మానవులు అనుకరిస్తారు. పెద్దల మాటలు పిన్నల పాటలు! ఒక నటుడు ఒక పద్యం ఏ భైరవి మీదో పాడేశాడనుకోండి, అర్ధం చెడకుండా ! అది వినే బాలురూ పామరులూ, దాన్ని అనుకరించే యత్నంలో, సమగ్రంగా దాని అర్ధ భావాలు గ్రహించుగోవలిసిన నిర్బంధం లేకపోవడంవల్ల, పదాల్ని చెడగొట్టి, అర్ధంతో నిమిత్తంలేని గాన ఫణితిమాత్రం ఫోటోలాగ దింప గలరు. ఏమి అంటే, అర్ధయుతమైన పద్యమూ అర్ధాతీతమైన రాగమూ
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/124
ఈ పుటను అచ్చుదిద్దలేదు