98 ఆంధ్ర నాటక పద్య పఠనం a జనింపచెయ్యవలిసిన నటుడులో ఉండాలో కాని, భూపాల వినేవాళ్లకి క్రోధంలో పాడినా ఆనందమే, విచారంలో పాడినా ఆనందమే, హాస్య యుతంగా పొడినా ఆనందమే. కాబట్టి, పదానికి ఒక సంగతిచొప్పున గానంలోంచి తవ్వుకు వచ్చి సంపుటీ చెయ్యడం అసాధ్యం. పోనీ, బహు విధ ప్రజ్ఞావంతుడైన నటుడెవడేనా ఆ నిర్వహణం తను చెయ్యగలనని నడుంకట్టినా, అది యితర రంగం కాదు, నాటకరంగం అనే సంగతిన్నీ కవి చిత్తవృత్తికి తను ప్రత్యక్షరూపం దాల్చిన సంగతిన్నీ జ్ఞాపకం ఉంచుగుం టే ఒక సంగతి విశదం అవుతుంది—'ఖలులయి' అనే పద్యాన్ని పఠించి అభినయించినప్పుడు కారణావస్థ క్రోధమైతే ఫలితావస్థకుడా క్రోధమే అవుతుంది. కాని, మనం పైన ముచ్చటించుకున్న అసాధ్య రీతిగా దాన్ని అతడు పాడ గలిగినా కారణావస్థ క్రోధమైనా ఫలిత రసం ఆనందమిళితమై తీరుతుంది. అనగా, సభ్యుడు, “ఆ, ఆ, ఇల్లాంటి పాడుపన్లు చేసి మమ్మల్ని అవమానపరిచినవాళ్లు, నేను బతికి ఉండగా ప్రశాంతంగా ఎలా ఉండగలరూ ? " అన్నట్టు ట్టు గద చేతులో ఉన్న కోపం పూనక, చప్పట్లు చరుస్తూ ( అదీ గానం మహిమ! ) " ఓహో, ఆహా ” అంటూంటారు. భీముడు వేషం కట్టిన రాజయ్యకి బిరుదు తరు ణమే కటాక్షిస్తూ కూచుంటారు. అట్లాగే, హరిశ్చంద్రుడు, నలుడు, రత్నాంగి, మల్లమ్మ గాగలవాళ్లు పద్యాల్లో రాగాలెడుతూంటే సధ వాళ్లు బలేబలే అంటూ చప్పుట్లు కొడుతూ, చీమేనా కుట్టనట్టు కులా సాగా సావకాశంగా ఉండడమేకాదు, ఈ వేషాలు కట్టిన వాళ్లు మా ఉద్దేశంలో ఎంత ప్రవీణులండీ, ఎంత ప్రవీణులండీ, ఎంత ఆనందంగా ఆనందంగా రాగాల్లో ఏడిచా రండీ' అని సూచించడానికి అరుపులు ఈలలు మొదలైనవి ప్రకటించి, అదంతా అధికారం తమది Xనక - మళ్లీ తిరగతోడి జరిపించాలని కుడా గోలచేస్తారు. ఇందులో సభ్యుల తప్పు ఏమీ లేదు. శృతితో గానం ప్రారంభం అవుతుంది. గానానికి శ్లాఘ తక్షణమే ఉంటుంది, ఉన్నట్టు
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/123
ఈ పుటను అచ్చుదిద్దలేదు