ఆనరాలు 97 లోగడే లలో ఒకటిగనక, ఆ రాగం కలుపుతూ భీమపాత్ర నిలపెడతానంటాడు, అనరు. ఇందులో విశేషం ఏమిటంటే, భీమపాత్ర నిలబెట్టడానికి లోగడే తనకి వచ్చి ఉన్న స్వంత మాటవరస వాడడు, కవి రచించిన వే భీము పాత్రకి వేరూ, రామ పాత్రకి వేరూ వేరూ కొత్త మాటలు వాడతాడు. కాని పద్యం ఉచ్చారణ చేసేటప్పుడు తనకి వచ్చి ఉన్న ముదరాగాలు రంగరించి, భీమపాత్ర, రామపాత్ర, ప్రతీ .రాజుపాత్రా అవే రాగాల్తో నిలబెట్టేస్తాడు. పద్యానికి భావమే కాదు, సమర్థుడైన రాజయ్య ప్రతిపదార్ధం చెప్పగలడు. తత్తుల్యంగా భూపాల రాగానికి ఏం చెప్పగలడు ? ' భూపాల 'కిగాని ఏ రాగానికి గాని అర్ధముండదు, అనగా అర్థం మానవులకి తెలియదు. గానం అవ్యక్తం అది గానానికి ఉండే లోటుకాదు, విశేషం; కళంకం కాదు, మహిమ! అంటే, గానానికి మానవులు కల్పించుకునే అర్థాలతోనూ పెడర్ధాల తోనూ నిమిత్తం లేకుండానే హృదయాకర్షణ చెయ్యగల ప్రభావం ఉంది. అల్లాంటి స్థితిలో, ' ఖలులయి ' అనే భీమపాత్రపదానికి, ఏ రాగంలో ఏ భీమపాత్రసంగతీ, 'నాడు' అనే ఏ భీమపాత్ర పదా నికి, ఏరాగంలో ఏ భీమపాత్ర సంగతీ - అనేవయినాల్లోకి వెడితే ఎవడు తేలగలడూ ! రాజయ్యా తేలలేదు. మరోచిక్కు. భీమపాత్ర పద్యం మరోరామపాత్రకి పనికిరాన ప్పుడు, భీమ పాత్ర యొక్క రాగసంగతులు రామపాత్రకి ఎట్లా ఉపచరిస్తాయీ! పైగా, మనం తీసుకున్న పద్యానికి ఏదో రౌద్రరసం అనవచ్చుగాని, ప్రతీ పద్యానికీ రసనిర్ణయం ఎక్కడ వీలూ ? పద్యాల్లో ఉండేది పదాలేగనక, పదాలన్నింటినీ, తొమ్మిది భాగాలు చెయ్యచ్చా ? ( అన్నం చతుర్ధా విభజ్య-అన్నట్టు!) తొమ్మిదిరకాల పదాలూ సందర్శించే రచన నవ రసభరితమా ? ఇక్కడికి పద్యం సంగతి అట్లా ఉంచి, భూపాల కేసి చూస్తే, అందులో క్రోధం ఉండాలో, దాని ద్వారా క్రోధం ఇతరుల్లో 13
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/122
ఈ పుటను అచ్చుదిద్దలేదు