96 ఆంధ్ర నాటక ప థ్య పఠనం ఆ పాత్ర ధరించిన రాజయ్యకి ఏమేమి తెలివి తేటలు ఎందులో ఎందులో ఉన్న యో, రాజయ్యకి ఎన్ని రాగాలు వచ్చునో, రాజయ్య ఎంతకవిత్వం చెప్పగలడో, రాజయ్య ఏమిబొమ్మలు చిత్రించగలడో చెక్కగలడో వెల్లడి అవడంకాదు, విషయం, అటువంటి సందర్భంలో రాజయ్య బయల్దేరి-భీమపాత్రగురించి కవి రచించియిచ్చిన పదాలు యావత్తూ సభ నాళ్ల చేత ఆరగింపు చెయించినవిూదట భీమవ్యక్తిత్వం వాళ్ల మనస్సుల్లో గోచరింప చెయ్యదలిచి, వచ్చి పద్యంలోమాత్రం తన రాగ కళ సంపుటీ చెయ్యడం అనేది, తన్ని చూసి సభ్యులు రాజయ్య అను కోవాలనే కుతూహలమేకాని, భీముడనుకోవాలనే తాపత్రయం కాదు. మరొక ప్రజ్ఞావంతుడు భీమపాత్రధరించి తను పద్యం అభినయించే దోసం దులో అదృష్టంచేత తనకున్న శిల్పశక్తీ పాఠశక్తి రుచి చూపించడం మొదలెడితే, సభవారికి నసాళం అంటిపోతుంది. కాని, సాధారణ రాగనటుడు ' ఖలులయి' అనేపద్యం వంటిదానికీ మామూలు వ్యాపా రమైనట్టు ' భూపాల' వంటిరాగం మెలిపెడతాడు. ఎందుకంటే: ' ఈ పద్యంరసం క్రోధం, భూపాల రసం క్రోధం, అంచేత అవి నా గాత్రంలో కలిశాయి. మీకు రాగం రాదుగావును, ఎదో పేచీ లేవదీస్తున్నారు' అంటాడు. వెంటనే అతణి మనం ఆపి, అతడి అభిమానకళ ' నటన ' గనక, పద్యానికి అర్ధమూ భావమూ ఫలానా అని తేల్చాలని అతణ్ణి కోరవచ్చు. తేల్చలేకపోతే అభినయం అభిమానకళ అని అతడు ఏ మొహం పెట్టుగుని చెప్పగలడూ ? తరువాత ' భూపాల' భావం ఏమిటి అని మనం అతణ్ణి అడిగాం అనుకోండి, ' దీని భావ మేమి తిరుమలేశ ? అన్నట్టు. దాని భావం అతడూ చెప్పలేదు. ఏ మానవుడూ చెప్ప లేడు. అయితేమరి భూపాలే అందులో కలపవలిసిన అవసరం ఏమొచ్చిందీ ? అది క్రోధానికి పనికొస్తుందనా ! అది శాంతానికి వాడిన గానరహస్య వేత్తలున్నా రే! చివరికి, ఆ రాగం తనకి పూర్వమే వచ్చి ఉన్న రాగా
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/121
ఈ పుటను అచ్చుదిద్దలేదు