పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/118

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన రా g లు 93 గద్యలోకంటే పద్యంలో విశేషాలు ఉండగలవు. పద్యపఠనం జరిగితే, అటువంటి సభ్యులు తమ మెప్పు తక్షణమే కురిపించి, తమకి చైతన్యం ఉన్న సంగతి ఖాయపరచడానికి వీళ్లు పోతాయి. వాళ్ళకంటే పద్యపఠిత పై చేయి అవుతాడు. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాడిమీద ఏదో కొంత అధికారం చెలాయిద్దాం అంటే వాళ్ళకి ఏమీ కనిపించదు. పద్య కవితాస్వాదన వాళ్ళవల్ల కాకపోయినా, ఆ విషయం పైకి తెలియ కుండా, వ్యవహారం నడిచిపోవాలంటే, పద్యానికి ఏదో ఒక రాగం తెచ్చి తగిలించాలని కోరడమే ! వాళ్ళకి ఏ రాగమా అనిగాని, ఒక రాగం పేరుగాని తెలియకపోడానికి హక్కు ఉంటుంది. పద్యానికి రాగం మినిమమ్ రాగం కలిపినా, ఏ మాత్రం శృతి ఉన్నా తక్షణమే తమ మెప్పో నిరసనో ప్రకటించెయ్యడానికి తరుణం ఉంటుంది. ఛంద స్సుని విస్మరించి, విద్యాస్వాదనికి దూరులై, కాస్త రాగపీలిక తగి లించినప్పుడుమాత్రమే కవిత్వం మెచ్చుగునేవాళ్ళ గండం గడపడా నికా, ఏ రాగప్రమేయమూ లేని కవిచేత ప్రత్యేక కళగా రూపొందింప బడ్డ పద్యాన్ని రాగపాశంతో బరబరా ఈడవడం ! అయితే అడ్డమైన వాళ్ళ లోట్లూ కమ్ముకోడానికా, పద్య రాగపమ్మేళనం ! నటుడూ పద్యంలోమాత్రమే క్షుద్ర రాగం కోరి, నాటకకర్తా పద్యంలో మాత్రమే క్షుద్రరాగం కోరి, ప్రదర్శనశ్రోతా పద్యంలోమాత్రమే క్షుద్రరాగం కోరడమా! ఆ క్షుద్రరాగం గానమా ! గానానికి పట్టవలసిన దశ ఇదా? ఛందస్సుకి పట్టిన దుర్దశ అదా ? ఎమో ఏమైనాసరే, ఆ రెండిం టినీ కలపడంలోనే కొత్త కళ అన్యుడై తోచవలిసిన నటుడే, తను ఏమైనాస రే—సృష్టి చేసి తీరాలని బుకాయించడమా ! అల్లా ఎక్కడ ఉందీ—అంటే, అనాదినించీ అల్లానే వస్తోంది- అని సమాధానం. అందు చేత, సభ్యులు నాటకకర్తని ఏమీ అనరు, అనలేరుగనక అతనికి లోట్లూ ఉండచ్చు, వాటిని మించిన గుణాలూ ఉండవచ్చు పొమ్మం