పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/117

ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 ఆంధ్ర నాటక పథ్యపఠనం పద్యం గుమ్ముగా వినవచ్చు. అందులోనే సవ్వాశేరులో బోలెడు పరాసికంలాగ, 'వన్స్ మోర్ ' పొందవచ్చు. సీసపద్యంలాంటిదాల్లో పాదాలకి పాదాలే ఎగరగొట్టచ్చు, చిదపకుండా బూరెకి బూరే మింగేసినట్టు. ప్రాంస్టింగు ( అందింపు ముక్కలు) పూర్తిగా అందే వరకూ దీర్ఘాలు అధికంగా తియ్యచ్చు. మరుపొచ్చిన ముక్కల జాగాలో రెండు చల్లని సంగతులు జార్చవచ్చు. ఎవడేనా సంగీతనటుడు ప్రద ర్శన వేళకి దగాచేసి మాయం అయినప్పుడు మరో నాటక రాగుడు పద్యాలముక్కలు ' ప్రాస్టింగు' మీద అందుకుని పాడేసి, నాటక ప్రద ర్శనం జరిగిపోయేటట్టు చూడవచ్చు. రంగం ఎక్కవలసిన వాళ్ళల్లో ఎవ డైనా రైలుమీద రావలినుండి, అది ఆలస్యం అయితే వాడు రంగం మీదికి హాజరయేదాకా, రంగంమీద ఉన్న వాడే పాట సాగించవచ్చు. కాని, ఏమాట కామాటే చెప్పుకోవాలి. నటుడు కొద్దివాడుగనక, అతడంటే మనికి నల్లేరుమీది బండిగనక, అతడిమీద మన చిత్రం వచ్చినట్టు అనేశాం. వాళ్ళేమంటారో వింటే, కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. 'ఈ నాటకంలో ఏముందండీ మా మొహం ! ఉన్నపళంగా ఆడితే ఒక్కడు కూచోడు. ఆ ఆ పద్యాలు కుడా ఎవడికీ తెలియవండి, ఏమీ బాగుండవు. పాడడం మానేశామా, నాటకం చచ్చిపోతుంది. ఏవో తడక పదాలంటూ లేకపోతే రాగవిజృంభణకి వీల్లేదుగనక, ఆ నాటకం తీసుగున్నాం' అంటారు. నాటకరచనలో పసలేకపోడాన్నీ, నాటకపద్యంలో జీవం లేకపోడాన్నీ కమ్మేసి ఏదో కృత్రిమరక్తి కట్టించే టందుకా రాగం ! అటువంటి వ్యాపారం ముద్రనాటకకర్తలకి లాభం గనక పద్యాలు పాడాలా ? ఇక, నాటక సభ్యులలో చాలామందికి లోగడగాని అప్పట్లో నటుడు చేసే ఉచ్చారణాభినయాలవల్లగాని విద్యార్థం అవగాహన కాకపోయినప్పుడు, వాళ్ళకి మా చెడ్డచిక్కు తటస్థిస్తుంది. గద్య విన్నట్టుగానే వాళ్ళు పద్యమూ వినవలిసొస్తుంది. වන