అ Ров లు 91 భావానికీ పద్యశ్రోతకీ మధ్య వాఖ్యాత ఉంటేనేకాని పద్యానికి గతి లేకుండా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి నష్టాలు కావా? ఈ పీడ విరగడ చేసుకోవాలని కొందరు: నాటకంలో పద్యాలు తీసేస్తే తీరిపోతుంది. అంతా వచనంలో ఉండిపో తే తగాదాలు ఉండవ్ కదా—అంటారు. నిజమే. కాని, అటువంటి వాదన ఏంధర్మం: నాటక కర్త పద్యరూపంలో అమూల్య భావాలు అందియ్యకూడదు అని ఆంక్ష ఎందుకూ పెట్టడం ! నటుడికి ధారణ తప్పదు గదా, పద్యరూపం ధారణ కెంతవీలూ! సరిచూసుకోడానికీ, నచ్చచెప్పడానికీ, పద్యరూపం ఎంత ప్రయోజనకారీ ! 'నువ్వు ఫలానా గద్యరూపంలోనే రచించు' అనీ నాటకకర్తకి హద్దు ఏర్పరచడం ఎందుకూ? 'అద్దు మీరిన వారిని దండింపబడును ' అని రైలుబద్దెలదగ్గిర రైల్వే అధికారులు కడుతూండి నట్టూ? ఒక్కొక్క నాటకకర్తకి పద్యరూపం స్వాభావికంఅయి అతడు తన భావం అవ్యత్రా చెప్పలేడేమో- 'కవిత్వంబులు నాకు చెందనివియేమో అంటివా నాదు జిహ్వకు నైసర్గికకృత్య మింతియ సుమీ' అనే ధూర్జటిలాంటివాడు! విలవ గలిగి అపరూపాలైన వాక్యాల్ని పద్యరూపంలో ఉండగలిగితే, మనం, నాటకరంగాన్నించి ఎందుకూ పోదన్నుకోవడం పద్యాన్ని ఎట్లా వెలువరించడమా అనే బాధలో, పద్యాన్నే లాగెయ్యమనడం లాయక్ కాదు. చేస్తూన్న పని తప్పు అని విశదంఅయిపోయినప్పుడు, కొందరు గడసర్లు అది పట్టి గెళ్ళి ఎవళ్ళనెత్తిని రుద్దడమా అని చూస్తూంటారు. అల్లాగ్దా : కొందరు నాటకకర్తలు, నటులు పద్యాలు పాడాలని మేం కోరలేదు, వాళ్ళే తమ లోట్లు కమ్ముకోడానికి పద్య రాగాల్ని జోడించు గుంటున్నారు—అంటారు. ప్రతి సంగీతనటుడూ అట్లా చేస్తాడని మనం సూత్రించకూడదుగాని, ఆ మాటలో సత్యం లేకపోలేదు. పద్యానికి ఉండగల అర్ధభావస్వారస్వాలు గ్రహించవలసిన నిమిత్తం లేకుండానే
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/116
ఈ పుటను అచ్చుదిద్దలేదు