3 89 అంత్య పరిష్కరణా వాక్యం అనిన్నీ, దానికి మరి తిరుగులేదనిన్నీ అతడి సంకల్పం. అదీ కాక, నాటక కర్త, తన గేయం గాయకుడు పాడాలని ఉద్దేశించవచ్చు అల్లాగే తన పద్యం సారస్వతుడు పఠిం చాలని కోరుకోవాలిగాని, పద్యమూ గాయకుడే పాడాలని కోరుకో కూడదు. కాని పద్యకర్త అల్లానే కోరుకుంటూ ఉంటాడు. కోరు కున్నా క్షుద్రరాగుడు తప్ప పద్యగానానికి గాయకుడు తేరగా రాడు. ఆ క్షుద్ర రాగుడే నయం అని పద్యకర్త ఉద్దేశపడితే ఏమన్న మాటా! సాహితీ పరుడు తన పద్యాన్ని పఠిస్తే వాడికి లోతుపాతులు తెలిసి పోతే చిక్కు గదా, అందుకని అటువంటి వాడకి పద్యరచనా ప్రక టన దూరం అయేనిమిత్తం తన పద్యాలు పాడితేగాని వీల్లేదని తను పట్టడుతూంటే, సారస్వతుడు కానటువంటి క్షుద్ర రాగుడు ఆపని చెయ్యడానికి, సిద్ధపడితే, పద్యగానం మెచ్చారా, ఆమెప్పు తను తన పద్యానికి జమ రాసుకోవచ్చు, ఛీ అన్నారా తనుకూడా ఇత రల్తో కలిసి ఆక్షుద్రరాగుడి నిర్వహణం బాగులేదు తనది ఎంకమంచి కవిత్వం అయి తేం అని వాదించి, ఎప్పుడూ తనదే విజయం అని చెప్పుగోవచ్చుగదా - అని. కాబట్టి పద్యానికి రాగం మెలిపెట్టడంలో తేరసొమ్ము దఖలు పడడం రూఢిగనక ఎటుపోయి ఎటొచ్చినా, తనకి కొంతలాభం ఉండి తీరుతుందని నాటక పద్యకర్త సంతోషం. ఇక, ప్రదర్శన ప్రేక్షకుల్లో ఒక్కొక్క గడసరి : ఒక చెవితో ప్రదర్శ నమూ రెండో చెవితో రాగరసమూ కళ్ళతో నటనారసమూ ఒకే క్షణంలో జుట్టుకుని ఆనందం ముప్పేటగా పొందుతూన్నట్టు వాదిం చగలడు, గాని తను వాడకం చేసే శబ్దాల నిర్వచనంలోకి వెళ్ళేటప్ప టికి, ఇవతల వాళ్ళు అనవసరంగా ఆరాలు తీస్తున్నారని మళ్ళీ వాదించగలడు. అసలు సంగతి తనూ రాగ సౌఖ్యంలో మాత్రమే ఉంటాడు, తక్కిన అందరికీకుడా రాగం తప్ప మరేమీ కుడా అక్క 12
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/114
ఈ పుటను అచ్చుదిద్దలేదు