పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/113

ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 ఆధ్రనాటక పద్యపఠనం అతనికి ఉండవచ్చు. స్పృహలేకపోయినా సరే మానవత్వంఉండీ ఖర్చు భరించగలిగి తే నాటకప్రేక్షకత్వం లభిస్తుంది. నటుడు కర్త రచించిన తే గద్య పద్య గేయాలు కఁఠపాఠంచేసి, గద్య స్వాభావికంగనక చెప్పే స్తూండేవాడు, అది అవగాహన అయి, అతడు సమర్థుడైతే అన్య త్వం సిద్ధించేది. పద్యాలు అతడికి వచ్చిన గానంతో పాడకపోతే అవి జీవించవనిన్నీ, అసలు చచ్చిపోతాయేమో అన్ని భయం. చెప్పవలిసిన ముక్కలు మరుపు రావడం జరిగితే, మరుపురావడం తనుతీనే రాగం చాలా ఉపయోగ పడుతుందిగదా అని అతని సంతోషం. భణుతులు నేర్చి అతడు మట్లూ, పాటలూకుడా పాడుతుంటాడు. ఈ రెండు పన్లూ చేసేటప్పుడు అతడు నటుడు కాడు, తనే. కనక ఆ రూ పద్యాల్ని గాని పాటల్ని గాని మళ్ళీ మళ్ళీ అతణ్ణి పాడవలిసిందిగా జనం గోలెట్టి అడిగేటప్పుడు, తనే తనకీ ఇతరులకీ గోచరిస్తూ ప్రజల మొర ఆలకించి, అతడు వాళ్ళు చెప్పిన ప్రకారం చేసేవాడు, లేక పోతే ప్రదర్శన ప్రేక్షకులు తమ హక్కుల ప్రకారం జంతు ధ్వనులు సృష్టిస్తూ గోలచేసి నెగ్గేస్తారు. ఎవో చవట చెత్త 'మాటల్తో అల్లిన బుట్టలాగ పద్యాన్ని గణించి, దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యడానికి తనే వీరకంకణం కట్టినట్టు నటు డుంటాడు. రెండో వాటాదారైన పద్య కర్త, తెలియకపోతే సరేసరి తనకి గానం తెలిసినా పద్యాల్ని స్వర పరచడు, లయపరచుడు, రాగసూచనేనా చెయ్యడు, అవి తన నోట్లోంచి ఎల్లా మొలిచాయో చెప్పడు, మూగనటిస్తాడు, మంచి రాగం తీసేవాడు ఝఝమాయించి పొడితే శృతి మించి మరీ రాగాన్ని పడిపోయిం దఁటాడు, సంసారిపక్షంగా తేలిస్తే తన పద్యంలో 'ఫోర్సు' పైకి రావడానికి వీల్లేకపోయిందంటాడు, అడ్డమైన వాడూ నటుడై తన పద్యకవిత్వాన్ని తగల పెట్టేస్తున్నా ఉంటాడు, ఉచిత రాగం ఉచితంగా కలిపితే ఉచితంగా ఉంటుం దంటాడు, అది ఒక