10. అనర్థాలు ఒక రావు హరిశ్చంద్ర వేషం వేశాడనుకోండి. అతడు వచనపుము క్కలు మాట్లాడేటప్పుడు శబ్దశక్తి యొక్క మహిమవల్ల శ్రోతల అంత రంగాల్లో వస్తుచ్ఛాయలు కల్పితమై, పూర్వపరోక్ష సంఘటనల అనుభ వాలుకలిగి, హరిశ్చంద్రుడి అవస్థ (నటించే రావు సామర్థ్యాన్ని బట్టి) గోచ రిస్తుంది, ఆ నటుడే హరిశ్చంద్రుడు అనిపిస్తాడు. కానీ, ఆరావు రాగంలో పద్యం అందుకున్నా, అందుకోడానికి ' ఊ 'ఁ అనుకున్నా, ఎవర ఉన్నది 'ఫలానా రావు' అని శ్రోతలకి తోచిపోతుంది గాని హరిశ్చంద్రుడు మరి తోచడు, గానానికి వృత్తాంత ప్రమేయం లేదు గనక, అది వ్యక్తిత్వ స్థాపనే చేస్తుందిగాని, అర్థభావాల ద్వారా అన్యత్వం స్థాపించడానికి నటుడు చేసే యత్నానికి దోహదం చెయ్యదు సరిగదా ప్రతిబంధకంగా పరిణమిస్తుంది. రా కాన్ని జొనిపి ' అది ఎల్లా ఉంటేం ఉంటుందీ, అదే వింటూండడం అజ్ఞానం, ఏ పదాల శ్రావ్యతకోసం దాన్ని తెచ్చామో, ఆ పదాలు విని అర్థం చేసుకోడం జ్ఞానం, అని వాదించడంలో జ్ఞానం కంటె తక్కిన దేఎక్కువ కనపడుతుంది. అర్థంతో నిమిత్తంలేని రాగమే శ్రోత మొదట ఆలకిస్తాడు, శ్రమఉండదు గనక! కష్టతరసులభతర వ్యాపా రాలు జమిలిగా మన కెదురైనప్పుడు ప్రప్రథమంగా సులభతర వ్యాపార దిశలో మన మనస్సు పెడుతుంది అనుకోవడమే సమంజసంగానూ సవివే కంగానూ తోస్తుంది. యోచనచేసి పండితులు సక్రమపరిష్కరణ చెయ్యకుండా ఉపే క్షించడంవల్ల, తెలుగుపద్యం పాడడపుఅకృత్యం ఏదార్నో ప్రవేశించి ఎంత లోతుగా వేరుదన్నిందీ అంటే: తెలుగుపద్యం పాడకపోతే కవన గానసంస్థలకి ఒబ దెబ్బని పరమద్రోహంచేసేసి పాపం కట్టుకుంటాం అన్న మాట,అనేభావం పఠితకీ శ్రోతకీకుడా కలిగేటంత 'యద్య దాచరతి శ్రేష్ఠ
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/110
ఈ పుటను అచ్చుదిద్దలేదు