పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/107

ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 ఆంధ్ర నాటక పద్య ప పద్య పథ రసానికి అనుగుణంగా బొమ్మలున్నాయని చెప్పేవాళ్లూ నమ్మేవాళ్లూ ఉన్నారు. కాని, ఎందుచేతో, నటుడు రంగం ఎక్కి, రసానికి అనుగుణంగా బొమ్మలు చిత్రించగలపాటి నేర్పరైనా అయిఉండాలి, పైగా ఆ బొ బొమ్మలతడు నాటకకర్త రచించిన పద్యం వినిపించే క్షణం లోనే, అర్ధానికి ఏమీ భంగం రాకుండా, కనులపండువుగా, చిత్రిం చాలి, అప్పుడుగాని పద్యం బాగుండదు అని వాదించేవాళ్లు లేరు. కాని, అట్లా చెయ్యగల చిత్రణనటుడు ప్రజ్ఞావంతుడు కాడా ! సంగీతనటుడు పద్యగానం చేసేవాడయితే చిత్రనటుడు పద్యచిత్రం అప్పటికప్పుడు వేసేవాడవుతాడు. నాటక ప్రదర్శ నాలలో మనికి లభించే చిత్రకళ యావత్తూ, నటుడు తన పద్యమోక్ష కాలంలో ప్రసాదించే సరుకా ! సంగతి యేమిటంటే : చిత్రరచన రూపం పొంది నిలవగల కళ. అందువల్ల నటవర్గానికి చెందని ఎవరో చిత్ర కారుడు లోగడే చిత్రించి పెట్టిన తెరలు వెనకదిక్కుగా ఉపయోగిస్తారు. ఒక బస్తీ వీధి, ఒక అరణ్యం, ఒక వనం, ఒక డేరాలవర స సర్వసాధారణంగా ఉండే తెరలు. ప్రదర్శనరంగాలకి అనుగుణంగా తెరలు మారుస్తూంటారు. అది రక్తికరంగానే ఉంటుంది. కాని, చాలాచోట్ల రంగం మారిందిక దా ఏదో తెరమార్పుగుడా చెయ్యక పోతే బాగుండదు అని చెప్పేసి, తెర పిరాయిస్తారు - ఒక్కొక్క వ్యాస లేఖకుడు మొహమాటంకోసం కొత్తపేరా మొద లెట్టినట్టు ! ఏ ప్రదర్శనానికి ఆ ప్రదర్శనపు తెరలూ అంటూ ఉండవు. అన్ని ప్రద ర్శనాలకీ అవే తెరలు. అనగా ఒక ప్రదర్శనపుమాటలు మరో ప్రదర్శ నానికి పనికిరావు గాని, తెరలు పనికొస్తాయి. కొత్త ప్రదర్శనానికి కొత్త తెరలంటూ ఉండవు. పాత తెరలు 'టచ్' చేస్తూండడానికీ, తెరమీద నాటి తేదీ వేసి దాన్ని 'అప్-టు-డేట్ ' చెయ్యడానికీ, ఒక చిత్ర కారుడు ఉంటాడు. కలపని అతడిది. అంతేగాని ఏ నటుడూ A కాని