ద ప్రతివాదన 81 వాచికంగా నటించవచ్చు. కాని, వెన్వెంటనే తను గానే తోచి వ్యాఖ్యానం చేసుకోగలడు. వెనక ఎవరో రాజు తన చిక్కులు తను పడుతూ ఎట్లా విచారించాడో మనకి చెబుతూ, తన స్వంతగానం మిళితంచేసి మనల్ని, హరిదాసు, ఆనందయుక్తంగా విచారులో పడే స్తాడు. నటుడు, ఎవరో రాజుయొక్క సంగతి చెప్పి మనల్ని ఆనంద యతంగా ఏడ్పించడానికీ, అనందయుతంగా భయపెట్టడానికి రాడు. తనే ఆ రాజులా మనకి తోచాలనీ, కనిపించాలనీకుడా వస్తాను. ఏ రసంలో అయి తేం, ఏదో ఒక అవస్థ యొక్క అనుభవం ప్రకటించి వ్యాపింప చెయ్యదలిచినవాడికి ఆనందమూ గానమూ ఎల్లా పుడ తన సభ్యులకి అవస్థ అవగాహనఅయి వాళ్ళకి సానుభూతి కలిగి తద్వారా వాళ్ళకి ఆనందం కలగాలిగాని ! ' 'నాటకం కొన్ని కళల సమీకరణంగనక పద్యాలు పాడడం మానకూడదు' అని ఒకాయన సెలవిచ్చారు. వారి అభిప్రాయంలో, తమరు వాడిన ' నాటకం ' అనేదానికి అర్ధం ' సంగీతనాటక ప్రదర్శనం అనిన్నీ, ' కళ ' అనే దానికి 'కవన గాన చిత్ర శిల్ప కళలలో ఒకటి ' అనిన్నీ, 'స మీకరణం' అనగా 'సంపుటి ' అనిన్నీ కుడా ప్రశ్నింప బడ్డమీదట అన్నారు. పై వాక్యంలోని మొదటి భాగం సత్యమే. నాటక ప్రదర్శనం కంటికీ చెవికీకుడా ఉశ్సవమిచ్చి ఆత్మానందం చేకూర్చాలి. కాబట్టి కళలన్నీ రంగంమీద ఉండవచ్చు. గద్యపద్యయుతమైన కవనం, గేయ యంత్రమూలక మైన గానం, యవని కాదిక మైన చిత్రణం, పరికర వేదిక మైన శిల్పం, అక్కడ ఉండవచ్చు. కాబట్టి, పద్యం యొక్క ఉచ్చారణ జరిగే కాలంలో మాత్రమే రాగసృష్టీ, తత్పద్య రాగసంధానమూకుడా నటుడే చెయ్యాలి అనడం, ‘ఏదో నా యిష్టం, ఇల్లా పోనీండి, అన్నానుగదా మంచో చెడ్డ' అన్నట్టుంది కాని, సబబుగా లేదు, కనక, గాన, చిత్రకళల సంబంధాలు చెప్పడంలో 11
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/106
ఈ పుటను అచ్చుదిద్దలేదు