80 ద ప్రతివాద న లోంచి రాళ్లు దొర్లించినట్టు! నాటకం జరుగుతూన్నంశ సేపూ శృతి మోగుతూనే ఉంది. తబలా వాగుతూనే ఉంది. ఏ వృత్త రూపమో ఒకటి పదునెట్టి ఒక నాటకకర్త తెలుగులో నాటకం రాస్తే, అది పాడ డమేనా, ఆడడరూ ? D కొందరు : గానం 'అమ్మయ్య' అనిపించి ' అనిపించి శ్రమోపశమనం చేస్తు దిగనక పద్యం రాగం తియ్యాలి, అన్నారు. నాటకకర్త శ్రమో పదమనం గురించి చాలా జాగర్త పడతాడు, అందుకనే, కధలో, ఘట్టాల్లో, ఉదంతాలలో, పాత్రల్లో, భాషలో రకరకాల వైవిధ్యం గమనించి మరీ నిర్వహిస్తాడు. గంభీకరంగ తరవాత తేలికరంగం అందుకనే, అంక, రంగ విభజన అందుక నే అనగా అప్పుడప్పుడు తెర పడుతూండడం, అన్ని పాత్రలూ ఒక రే ధరించక పాత్రకి ఒకరు చొప్పున ధరించడం అందుక నే. పైగా, పద్యం జరిగే కాలంలో రాగం ఎట్లా అని మన విషయంగాని, నాటకరంగాన్నించి గానాన్ని ఊడ్చి పారెయ్యాలని ఎవరూ అనలేదు, నేనూ అనను. రంగాల మధ్య, నాటకం రక్తి చెడకుండా, కవనగానరసజ్ఞులు మెచ్చేలాగ, గాయకుణ్ణి పెట్టి, అతడిచేత ప్రదర్శనశ్రోతలకి గానం ఇప్పించవచ్చు. నాటక సమా జానికి ఒక సార్ధక గాయకుడు చాలు. చిత్రకారుడు ఒకడు ఉండడం లేదూ! అతడు అదివరకే చిత్రించిన తెరలు ప్రదర్శనంలో చూపి స్తున్నారుగాని, పద్యం జరిగే క్షణంలో నటుణ్ణి, యధోచితంగా అభిన యిస్తూ, తెరలు చిత్రించకుంటున్నారా? కొందరు కళాభిమానులు : హరిదాసు పద్యాలు పాడి రక్తి కట్టించడంలేదుటండీ, పాడ్డంలో ఉంటుంది మజా ! అనేస్తారు. కాని, జరిగిపెట్టు నమ్మబడే సంగతి చెప్పేవాడు హరిదాసు, అప్పటికప్పుడు జరుగుతూన్నట్టు భ్రమింప చెయ్యడానికి రంగం ఎక్కేవాడు నటుడు. హరిదాసుూత్రం అప్పుడప్పుడు నటించడా అంటే, మానసికంగా,
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/105
ఈ పుటను అచ్చుదిద్దలేదు