పుడతాయి. ఆంధ్ర నాటక ప ద్య ప పద్య పఠ 79 లేమిటి ? దాని విశేషాలేమిటి? దాన్ని నేను ఎట్లా ఉచ్చారణచేస్తే అందులోఉండే పదాలు జీవించి, పాత్రసిద్ధి జరుగుతుంది ? కవిత్వరూపం ఎటువంటిది ? వృత్తనియమాలు ఏవి? అలంకారాలు ఏమిటి? నడక ఏమిటి ? పూర్వకవిత్వం ఎట్టిది ? మొదలైన ప్రశ్నలు నటుడిమనస్సులో కాని, సంగీతనటుడు, ఏమి చేస్తున్నాడూ! పద్యంలో దొరి కే కవిత్వంసంగతి అవతల పెట్టి, తనకి వచ్చిన భైరవీ, కాంభోజీ, తోడీ పద్యానికి కలిపేరీతిగురించిన నిరంతర ఆలోచనలో పడుతున్నాడు. అన్యు డెవడైనా ఎక్కడేనా ఏదేనా సంగతి వేస్తే, అది రంగంవించి తను ఎక్కడ దొర్లించవచ్చో చూసు గుంటూ ఉండడం, అన్యుడు చూసుగుంటూ ఆ సంగతి అభేదిలో వేస్తే తను ఆనందభైరవిలో వెయ్యడం. ఇల్లాంటి ఎత్తులతో గానంలోనూ గాక, గానశాస్త్రంలోనూ కానటువంటి వ్యవ సాయంలో ఉండిపోయే సంగీత నటుడు పద్యోచ్చారణకి ఎట్లా అర్హుడూ? పద్యం అతడి సొమ్మెట్లా అవుతుందీ? అదీకాక, అక్కడక్కడ పద్యాలు తగుల్తూంటాయి కాబట్టి, పద్యాలు రాగాలుతో అనాలిట– అల్లా నటులు శ్రమరహితంగా పాడ డాని కేట రచయితలు పద్యాలు అక్కడక్కడ రానియ్యడం ! కాని, నాటకం విశేష భాగం పద్యరూపంలోనూ అక్కడక్కడ గద్యాత్మ కంగానూ ఉంటే, అప్పుడు గద్యలే పాడతారా పద్యాలు మానేసి కే పోనీండి, నాటకం యావత్తూ పద్యరూపంలో ఉంటే అంతా రాగా లెట్టి పాడడ మే! అయి తే నాటకం ఆడడమా పాడడమా? ఒక పార్శీకంపెనీ వాళ్లు కాకినాడలో 1916లో ఒక నాటకం అంతా పాడేశారు. కారణం ఏమంటే, ఆ నాటకకర్త నాటకమంతా ఒక రకం ద్విపదలో రాసే శాడట! కాబట్టి రాజు, మంత్రి, బంటు, రాణి, దాసి అంతా కూడబ లుక్కుని వచ్చేసినట్టు ఒకే రాగం - (ఫీలు అని జ్ఞాపకం) జోడించి నాటక పద్యపాదాల్ని సభ వాళ్ల మీద దొర్లించేశారు - ఖై బరుప్యాన్ -
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/104
ఈ పుటను అచ్చుదిద్దలేదు