పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/101

ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 వాదప్రతివాద న కాదు. అంతకు పూర్వమే స్వయంగా తనో, లేక తనకి నచ్చిన అన్యుడో సృజించినవి. అనగా, ఆ పదాలు గాయకుడు ఆ క్షణంలో సృష్టించే కవిత్వం కాదు. కాని, గానం దారి వేరు. గానానికి వర్త మానమేరాని భవిష్యం లేకపోవడంవల్ల, ఎప్పటి గానం అప్పుడే సృజింపబడాలి, ఎవరి గానానికి వాళ్ళే రూమ ఇయ్యాలి.. ఒక కవి రచించిన పదాల్ని మనం మరొకరితో చెప్పడానికి వీ అంటుంది గాని, ఒక గాయకుడి రాగం మనం మరొకరితో మనివి చెయ్యడం అసాధ్యం. కాబట్టి, రాగం అనేది అది నరకే రచింపబడి నిర్ణీతమై వ్యవహరించడా నికి వీలైన ఆకారంలో ఏ సీసాలోనో ఉన్నట్టు కాస్తంత రాగం అనడం, గానం యొక్క మహోత్కృత్యలక్షణం కలుపుగుంటేం విస్మరించడం. -- వె మరి కొందరు మొహమాటం విడిచి : కవిత్వం ఎంత గొప్ప దైనా పద్యాన్ని పఠించి ఊరుకుంటే బోసిగానూ బోడిగానూ ఉంటుంది. కాబట్టి పద్యవైధవ్యం తొలగించాలంటే రాగాలంకరణ విధాయకం. అందుచేత నాటకరంగంమీద నటుడు పద్యాలు పాడాలి అంటారు. ఆంధ్రపద్యాన్ని బోసి, బోడి అనడం ఆంధ్ర ఛందశ్శాస్త్రానికి శూన్యం పెట్టడమేకాక, వెయ్యేళ్ళ కృషి మీద వెల్తిమాటాడి నోరు పారేసు గోవడంకుడానూ! అయినా, పుట్టువితంతువులైన ఆంధ్రపద్యాల వైధవ్యం తప్పించడానికి, వీరేశలింగంపంతుల్ని మించాలని చూసే ఉత్సాహవంతులు ఉండగలరు. చెడ్డ రాగం, వాళ్ళు, తీసుగు రానియ్యరు. అదీ వితంతువే! మంచి రాగానికి ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణగల రాగమే మంచిది గనక అల్లాంటిదే పట్టుగొచ్చి కలపాలని వాళ్ళ పట్టుదల. కాని, ఆకర్షణశక్తి ప్రతికళ్ళకీ ఉంటుంది. నటుడి కళ నటనం. నటనంమూలంగా ఒకడు జనాన్ని ఆకర్షించినప్పుడే అతడి నటనం ఒకకళ. అట్లా చెయ్యలేక, చెయ్యలేనివాడు ఊరుకోక, ויד అదీ కాదు.