పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాద ప్రతివాదన

75

పరచడానికి అదా అదను ? పోనీ తనకి రాగాల ఆస్తి ఉన్నసంగతి మొదటే సభకి తెలియపరిస్తే ! మరో నటుడికి రాగాలన్న మాటేమిటి, కవిత్వం కట్టడంకుడా వచ్చు నను కోండి. నాటకపద్యం ఆస్వాదించగా ఆస్వాదించగా, అది వెళ్లి కవిత్వంలో దిగుతోందని చెబుతూ, అతడు తన స్వంతకవిత్వపైత్యం, నాటకపద్యంలోని శబ్దాలసందున జొనప వచ్చా! అప్పుడు నాటకపద్యానికి మెరుగు పెట్టినట్టై రసం ఇనుమడిం చదా? - అంటే, కూడదుట. ఎందుకు కూడదనగా, చేసే పనియొక్క అవకతవక వీధిని పడిపోతుంది. కాని, రాగంలో పదాలు కాక మనకి అర్ధంతెలియని స్వరాలుమాత్రమే ఉండడంచేత, జరుగుతూన్న హాని గోచరించడంలేదు. ఇంకోనటుడికి అనేకభాషలు వచ్చిఉండచ్చు. వచ్చి నంతమాత్రాన్ని, ఒకతెలుగురచయిత రచించిన నాటకపద్యం ఉచ్చా రణచేసే మధ్యరంగంలో అవన్నీ ఎట్లాదొర్లించడం? ఒక తెలుగుపద్యం అభినయించే పట్టులో, రసం అభివృద్ధిచెయ్యడానికి ఇంగ్లీషుమాటలు ( నటుడికి వచ్చునుగనక ) మిళావు చెయ్యవచ్చా ? - అదీ నాజనకమే గనక? అన్నింటికీ ఏమి, పోనీ, పద్యం ఆస్వాదించగా ఆస్వాదించగా శృతిమించి రాగాన్ని పడుతుందనేవాళ్లు, ఆ రాగాన్ని ప్రకటించి ఊరుకోకూడదూ, పద్యంలోని మాటల్ని పూర్తిగా వదిలేసి ? రాగాభి నయమే తెలుగునటుడి కళ అని నిర్ధారణేనా అయిపోతుంది !

ఒకరి అభిప్రాయం : ఒక కళ ఇతరకళల్ని ఉపాంగాలుగా తీసు కోవచ్చు. సాధారణంగా సంబంధంగల కళల్నే తీసుకుంటారు. గాయ కుడు తను గానంచేసేటప్పుడు కొన్నిపదాల్ని ఉపయోగించుగున్నట్టే ( రెండూ నాదజనకాలే గనక ), పద్యాన్ని ప్రకటించేవాడు కొన్ని స్వరాల్ని ఉపయోగించుకోవచ్చును — అని. కాని ఈ ఉపమాన ఉపమే యాలకిభర్జించని విషయం ఒకటుంది. గాయకుడు పదాలు ఉపయో గించుగునేమాట రూడే, కాని అతడు అప్పట్లో కల్పించుగున్న బాపతు