పుట:Andhra Granthalayam 1939 09 01 Volume No 01 Issue No 01.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందరికీపుస్తకాలు!

అందరికీ పుస్తకాల్ - అంధులకు పుస్తకాల్
పిల్లలకు పెద్దలకు - ఎల్లరకు పుస్తకాల్ ||అం||

1. నారీమతల్లులకు - నోర్లేనివారలకు
కలవారలకు - లేని కటికబీదలకును ||అం||

2. పనిలేకతిరిగేటి - పట్టణవాసులకు
పగలెల్ల పాటుబడు - పల్లెజనములకెల్ల ||అం||

3. పేటలో గ్రంథాలు - కోటలో గ్రంథాలు
బాటలో గ్రంథాలు - బోటులో గ్రంథాలు ||అం||

4. స్వేచ్ఛగా తిరిగేటి - స్వచ్ఛందవాదులకు
ఖైదులో మ్రగ్గేటి - ఖైదీలతోసహా ||అం||

5. రోగములతోకుళ్ళు - రోగిష్ఠులకెగాక
శారీరమునమంచి - ఆరోగ్యమున్ గల్గు ||అం||

6. చదువనేర్చినయట్టి - చదువజాలనియట్టి
పండితపామర - మండలికి నంతాను ||అం||

'Books for All' is the title of this inspiring song. The several trends of this revolutionary sloan of the Modern Literary Democracy are indicated in these lics of. The Churus of the Modern Library Movemen:- P.141. Fide Laws of Library Science by S.R. Ranganathan.