పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'సంచార గ్రంథాలయ శకటము'

కౌమారగురుకులం – మన్నారుగుడి

“దక్షిణాదిని మన్నారుగుడిలో రావుబహదూర్ ఎస్.వి.కనకసభాపిళ్ళెగారు రెండెడ్ల బండి మీద పుస్తకాలను బంపి 75 గ్రామాలలో దాదాపు 100 గ్రంథసంచిత స్థానాలద్వారా విజ్ఞానసేవ చేశారు. ఆయన ఇప్పుడు కీర్తిశేషులయారు. ఆబండికూడ ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు.ఆ సహృదయుని ఆత్మ ఇప్పుడెంత బాధపడుతోందో!ఈ సంచార గ్రంథాలయ సేవను పునరుద్ధరించి ఆ పవిత్ర పురుషుని ఆత్మకు శాంతి చేకూర్చే బాధ్యత ఆ ప్రాంతాల వారి మీద ఉంది!!! "