ఈ పుట ఆమోదించబడ్డది

మలయజ శిశిర తనురుచిర
జలరుహదళ సదృశనయన జలనిధిశయనా !
కలరవ కలిత కటకయుగ
సులలిత మృదుపద పయోజ ! సుందరరాజా !


ఇది వ్రాయునాటికి గవియీడు ఇరువది రెండేడులు. అప్పటికి జిన్న సాహితియు గవితాధోరణియుగల యాచార్యులుగారు, ఇంక నిచట కూపమండూకమువలె నుండరాదని సమీపమునగల మదరాసునకు వచ్చెను. వచ్చి యానాడు చెన్నపురిలో మంచి వ్యుత్సన్నుడై ప్రామాణికుడైయున్న పరవస్తు చిన్నయసూరిని జేరి యతనితో ననేకవిషయములు చదివెను. సూరి రాజధానికళాశాలలో బ్రధాన పండితుడు. పురాణము హయగ్రీవశాస్త్రిగారు రెండవపండితులు. ఈయిర్వుర సాహచర్యము సీతారామాచార్యులుగారికి విద్యాసంగ్రహణమున జాల నుపకరించినది. 'శబ్దరత్నాకర' నిఘంటురచనాబీజ మాచార్యులవారి హృదయకేదారమున బడినది యీసమయమే. సూరి యహోరాత్రము లదేపనిగా విశ్వనిఘంటురచనోపయోగి పరికర సంగ్రహణ మొనరించుచున్న సమయమది. పాపము! అతనితలచినపని పూర్తికాకుండగనే 1862 మ్రింగి వైచినది. సూరి తత్సమపదములకర్థము వ్రాయవలయునని తలపెట్టలేదు. మన యాచార్యులుగారు తత్సమ పదములుచేర్చి, సూరినిఘంటువు నాదర్శముగా దీసికొని సర్వప్రశస్తముగా "శబ్దరత్నాకరము" నావిష్కరించిరి. సూరి గతించిన 1862 లో నారంభమై యించుమిం చిరువదిమూడేడుల వఱకు సాగి 1885 లో నీనిఘంటువు బయటికివచ్చినదని చరిత్రజ్ణానువులకు దెలివిడి. శబ్దరత్నాకరరచన సాగుచున్న కాలముననే యాచార్యులవా రనేకకృతులు వ్రాసిరి. నిఘంటునిర్విఘ్న పరిసమాప్తికి 'వినాయక శతకము', రచించిరి. దానిలోని పద్యములు సొగసుగా నున్నవి.


వంకర తొండము చేటల
సొంకము గలచెవులు పెద్దపొట్టయు దగ ని