ఈ పుట ఆమోదించబడ్డది

పూండ్ల రామకృష్ణయ్య పండితుడు వేంకటరత్నము పంతులుగారి బిల్వేశ్వరీయాది కృతులు విమర్శించివైచెను. ఆయీ విషయములకు నముద్రిత గ్రంథచింతామణి యరయనగును. వేంకటరత్నకవి కవిత సంస్కృతసమాస నిబిడము. ఈయనకు సంస్కృతభాషా పాండిత్యము తక్కువయనియు దెలుగున గట్టిశక్తి కలదనియు విమర్శకు లనిరి. అదిమనము సహింపరాని మాట. వీరు వెండి, బంగారము మున్నగు క్రొత్తరకపు వృత్తములు కల్పించి తమ ప్రబంధములలో జేర్చిరి.


సీ. చిటిపొటి కొంపలు చిన్నవి పెద్దవి
          యిండ్లు మిద్దెలు దారి కిరుగెలకుల
నారు పోసినయట్లు నారక యెన్నేని
          పూర్వాచరణముల పోల్కి దనర
మరికొన్ని సుగృహహర్మ్యములు సూత్నాచార
          ముల యట్లు పై పయి మురుపుసూప
జైత్యద్రుమంబుచే సత్రంబులుగ వార
          మున కొకనంతయె యొనర విపణి


గా నధిత్యకనృహరి నికాయమె ఘన
రాజమందిరముగ గడు రాజిలంగ
జానపద జన సహజమెయైన బౌర
కోవిదావాసము నగు గోర్కొండపురము.
                                     [కుమార నృసింహము]


వీరేశలింగముపంతులుగారును వీరును పరస్పర గ్రంథ విమర్శనములు గావించుకొనిరి. ఆ గ్రంథవిమర్శనములు క్రమముగా వ్యక్తిదూషణములకు జేరి విసుగుపుట్టించినవి. అయినను భాషాజిజ్ఞానువుల కా విమర్శనములు కొంత యుపయోగపడిన ననవచ్చును. వేంకటరత్నము పంతులుగారు 'ఆంధ్రభాషాసంజీవినీ' పత్రిక కనుబంధముగా హాస్యసంజీవిని