ఈ పుట ఆమోదించబడ్డది

సరసుడు దూరమేగునని చాలగ నామది చింతనొందు నె

ల్లరకు వినోదియైనను గళానిధి వైర మొనర్చె వెండియున్

బరభృత కాకలీరవము బాసి తనర్చును నిష్కుటీ విసృ

త్వర మలయానిలంబులస బ్రాణములేహరియించు నెంతయున్.


ఆచార్యులుగా రనపత్యులు. 'భరతాభ్యుదయము' వారిపుత్రుడు. అవధాన ప్రతిభాయాతమగు కీర్తి వారిపుత్రిక. గుంటూరిలో నిప్పుడు న్యాయవాదులుగా నున్న వేదాంత నరసింహాచార్యులుగారు వీరి దత్తకుమారులు.

                           __________