ఈ పుట ఆమోదించబడ్డది

యోగము పట్టలేదు. ఆయన బొబ్బిలిసంస్థానకవి కావలసియుండెను. ఆనందగజపతిదర్శనము చేసి పార్వతీశ్వరకవి యమూల్య పద్యములు చదివెను. అం దిది యొకటి.


అప్ప్రదుడగు మేఘుడు బలి

కుప్రదుడగు ఖేచరుండగు ననుప్రదుడ

క్షిప్రదుడగు నర్కుడు నం

దప్రదునకు సాటియనగ దగునే వీరిన్.


విజయనగరములోని యాస్థానపండితుడు ముడుంబ నరసింహాచార్యకవి "అన్నుపతాళజాల కహహా! యని తల్లడమందె నెంతయున్" అను సమస్యనిచ్చి "వెన్నెల గాయ గాయజుడు వేమఱమై విరిగోల లేయలే" యని పూర్వార్థము వెనుక నేను పూరించితినని తక్కిన చరణములు శాస్త్రులుగారు చెప్పవలయుననిరట. అప్పుడది యాశువులో ననుప్రాసము వచ్చునట్లు వీ రిట్లు పూరించిరి.


క్రొన్నన గోయ గోయనుచు గోయిల కన్నెఱ జేయ జేయటుల్ కిన్నెర బాయ బాయసము కీల్కొని పొంగిన చాయ చాయలన్


1865 లో వావిలివలస జమీందారగు ఇనుగంటి సీతా రామస్వామిగారి దర్శనమున కీ కవి వెళ్ళినపుడు వసుచరిత్రలోని పద్యమునిచ్చి సంస్కృతీకరింపుమనిరి. తెలుగును సంస్కృతములోనికి నింతమాధురీధుర్యముగా మార్చిన-మార్చగల కవులు తక్కువ.


అతవ్వంగి యనంగఝూంకరణవ జ్జ్యాముక్త చూతాస్త్ర ని ర్ఘాతం బోర్వక తమ్ములంచు దటినీ గర్భైక పంజాత కం జాతవ్రాతము మాటుచెంద పది యేచన్ సాగె మున్ముందుగా జ్ఞాతిశ్చే దనలేన కి మ్మనెడి వాచారూడి సత్యమ్ముగాన్ సాసహ్యస్మరఝంక్రియాశ్రయ గుణోన్ముక్తామ్రబాణక్షతిం తన్వీ సారసజాతి రి త్యపధృతా పద్మాటనీ మాశ్రితా