ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సహజకవితాధార కాయసాధారణపాండిత్యము తోడైనది. పండ్రెండవ యేటనే వాటముగ గవిత వ్రాయ నారంభించి "కవితా లతాంకురము" పంతముపట్టి గంటలో జెప్పెను. చిన్న నాటనే వేంకటగిరి మున్నగు సంస్థానముల కేగి కవితాప్రదర్శనమున సత్కరింపబడెను. బొబ్బిలి సంస్థానమున విద్వత్కవిగా గుదిరెను. ఆయాసంస్థానరంగములలో నీయన కనబఱిచిన కవితాచతురత వేనోళ్ళ మెచ్చుకోలుబడసినది. పార్వతీశ్వరకవి తత్తజ్జీవిత విశేషములు 'ఆత్మచర్య' యను సీసపద్యములలో వ్రాసికొనెను. ఇది యొకటి చదువుడు:


మఱియు సద్ధాతలో వఱపు పట్టగజూచి

గుఱుతు తప్పక వానకురియునట్లు

మంచిపద్యములు గావించి తెండని రంగ

రాయవిభుం డాదరమున బల్క

నీమీద భారంబు నేనుంచి యమృత బీ

జాక్షరఘటిత పద్యంబు లైదు

పంచరత్నము లన బచరించి నవరత్న

పద్యయుక్తముగ దత్ప్రభున కొసగ


గాకతాళీయసయమున గాలివాన

కురియ జేసితి వది మాంపగోరి మాంపి

కౌర! యతివృష్ట కష్టహరాష్టకమున

హరిహరేశ్వరదేవ! మహానుభావ!


ఇచట రంగరాయవిభుడన బొబ్బిలి ప్రభువు వేంకటశ్వేరాచలపతి రంగారావు బహద్దరువారు. ఈకవి యిట్టి సిద్ద వాక్కనుటకు సందేహింప బనిలేదు. బొబ్బిలిలో నితడు 1876 లో బ్రవేశించి 1897 వఱకు సంస్థానకవిగా నుండెను. అదియే వీరి జాతకమున ఘనదశ. అంతకుమున్ను శ్రీవిజయనగర మహారాజు దర్శనమునకు బోయి 1867 లో నచట గవితాప్రతిభా ప్రకటనము చేసెను. వారి యాష్టానకవితాస్థానమున నుండుటకు