మయ్యెడి " నని పీఠికలో వ్రాసిరి. కాని యీ మొదటిపద్యము ప్రక్షిప్తమనియో, లేఖకులెవరో ప్రార్థనమునకు వ్రాసికొని రనియో చెప్పితీరవలయును. దీనికి రెండు ప్రబలకారణము లున్నవి. శ్రీ రాజన్మహిజా... అని శ్రీకారముతో రెండవపద్యము ప్రారంభింపబడినది. అది శ్రీరామ ప్రార్థనము. ఈకవి " శ్రీరామచంద్ర సాంద్ర కరుణాసమాగత కవితా మాధురీ ధురీణుడ " నని యాశ్వాసాంతవచనమున జెప్పుకొనుటచే గావ్యాదిని శ్రీరామప్రార్థనమే చేసినాడనుట యుక్తము. ' నీలాసుందరి ' లోని ' శ్రీలకు దానకంబగుచు ' నను పద్యము శివస్తోత్రపరము. ఈ పద్యము మొదటజేర్చుట కవిమతమును జెరుచుట యగును. అదియు గాక మూడవపద్యముల "...కాంచనాచలో, దారశరాసనుండు జయధన్యత మాకొనరించు నెప్పుడున్ " అని ఈశ్వరుని ప్రార్థించినాడు కూడను. దీనిని బట్టి కూడ మొదట ముద్రించిన పద్యము తీసివేసినగాని నసిపడదు. ఉత్తరా పరిణయము చక్కని కావ్యము. ఈ కావ్యకర్తకు భగవంతు డాయువిచ్చిన నిట్టికబ్బము లెన్ని సృష్టింపబడెడివో ? ఈ కవి చక్కగ సంభాషించెడివా డనుట కచటివా రీవిషయము చెప్పుచుందురు. " పిండిప్రోలు లక్ష్మణకవిగారును వీరును బావమరది పరియాచక మూడు కొనుచుండువారు. ఒకప్పుడు ఏదో సభలో లక్ష్మణకవి కూర్చుండి యుండ మనకవిగారు వెళ్లిరట. మరియాదకు లక్ష్మణకవి చోటుచూపి " దొరలకు చోటు చాలా " యనెనట. అప్పు డీయన " దొరలకు - చోటు చాలు " నని సమాధానము. (దొరాకుము=ఒత్తగిల్లకుము) కవి సంభాషణ చాతుర్యము!
పుట:AndhraRachaitaluVol1.djvu/62
ఈ పుట ఆమోదించబడ్డది