ఈ పుట ఆమోదించబడ్డది

రించిరి. శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు దానికి బీఠిక వెలయించిరి.

ఈప్రబంధ మరసినచో నీకవి చక్కని ధారాశక్తి కలవాడని స్పష్టమగును. మను వసు చరిత్రాదులలోని పద్యములచాయ లీతని కవిత్వమున గలవు. ఏవో స్వల్పదోషము లున్నను మొత్తముమీద నీకవి ప్రయోగపరిజ్ఞాతయు, వ్యాకరణజ్ఞానము కలవాడుగా దోచుచున్నాడు. రెండవయాశ్వాసమున... " భ్రమ, ద్రటదవదాత పత్ర నికురంబము..." అని ప్రయోగించెను. " ఇట ' నికురుంబము ' గాని ' నికురంబము ' గాదు" అని పీఠిక. ' నికురంబ ' మను అత్వయుక్త ప్రయోగమే లక్షణసమ్మతము. బాహులకము వలన ఉత్వము కూడ రాగా " నికురుంబము " అని కూడ నగును. ఉకార విశిష్టమైన ప్రయోగము ప్రహతముగా నున్నది. కాని నికురంబము తప్పుకాదు. ఈపదము నుపయోగించుట బట్టి యీకవికి వ్యాకరణజ్ఞానము చక్కగా నున్నదని యవగతము. ఈకవి ధారాశుద్ధి కలవాడగుట కీ పద్యము చాలును.

బంతులుదేరి పూబొదల సజ్జలజేరి సరోజపాళికై
దొంతిగ బాఱి జుమ్మనుచు దూరెకు దూరెకు మల్లికాసభా
సంతతి దూరి భాసిత రసాల విశాల మరందధార ల
త్యంతము గ్రోల గోరి మధుపావళులొప్పె వనాంతరంబులన్.
                                             2 ఆశ్వాసము

ప్రబంధ ప్రారంభమున " శ్రీలకు దానకంబగుచు..." ఇత్యాదిగా నున్న నీలాసుందరీ పరిణయములోని మొట్టమొదటి పద్యము యథాతధముగ జేర్పబడియున్నది. " ఇంతమాత్రమున నియ్యలఘునందు గ్రంథ చౌర్యము నారోపించుటకన్న, నీయనకు శ్రీ కూచిమంచి కవిసార్వభౌమునియం దపారమైన యభిమానముగలదని తెల్పుటకుగా నది సాధక