ఈ పుట ఆమోదించబడ్డది

గల మర్మంబులు నాకుదెల్పి కవితా నైపుణ్యముంగూర్చు చా

వలి లక్ష్మీ నరసింహశాస్త్రి గురుదేవ స్వామికిన్ భక్తిమై.

1925 ప్రాంతమున పిఠాపురమున నుండి, శ్రీ దర్భాసర్వేశ్వరశాస్త్రిగారి కడ వీరు వ్యాకరణ శాస్త్రాధ్యయనము గావించినారు. ఈక్రింది పద్యము చూడుడు:

శా. తర్కవ్యాకృతి పారదృశ్వు నిఖిలాంధ్ర జ్యౌతిషాంగ్లోక్తి సం

పర్కున్ సూర్యబుధేంద్ర శిష్యమణి దర్భావంశ్యు సర్వేశ వి

ద్యార్కున్ వ్యాకరణోపదేశికు ద్వితీయానంతు నెంతున్ శుభో

దర్కత్వంబు కృతజ్ఞతం బడసి మత్కావ్యంబు రంజిల్లగన్.

"మునిత్రయచరిత్ర"

మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారికి వీరు 'మునిత్రయచరిత్ర' నంకిత మొసంగిరి. ప్రత్యేకముగా "రాయడు శాస్త్రి యశశ్చంద్రిక" కావ్యము రచించి మహామహోపాధ్యాయుల షష్టిపూర్తి సన్మానసందర్భమున నర్పించిరి. ఇవన్నియు నేల పేర్కొనుచుంటి ననగా, శ్రీ సూర్యనారాయణశాస్త్రిగారి హృదయములో పండితగురువులపట్ల నిట్టి భక్తి ప్రపత్తు లున్నవనుటకు.

సంస్కృతాంధ్ర వైదుషీ భూషితులైన వీరు 1930 సం.లో అమలాపురము బోర్డుహైస్కూలున తెలుగు పండితులుగా బ్రవేశించి రెండేండ్లు అచ్చటనుండిరి. తరువాత కాకినాడ నేషనల్ స్కూలులో మఱిరెండేండ్లు పండితోద్యోగము. పిదప, పాణంగిపల్లి జమీందారు శ్రీనబ్నివీను కృష్ణారావు పంతులు (బి.ఏ) గారికి సంస్కృతాంధ్రోపాధ్యాయత్వము.అప్పుడే ప్రొద్దుటూరి 'కవి' వ్యాసపు పోటీపరీక్షలో ద్వితీయ బహుమానము. ఈ పురస్కారము కారణముగా జమీందారు "కవిసింహకంకణము" చే సూర్యనారాయణ శాస్త్రిగారిని బహూకరించెను. "జీమూతవాహనచరిత్ర" మను ఖండకావ్యము పాణంగిపల్లి