(3)అక్కడ పాదుకలువదలి సభలో చిత్రాసనముమీదగూర్చుండుట. పయి షరతులలో మొదటి రెండును మహారాజున కంగీకార్యములైనవి. చివరిది మాత్రము వా రంగీకరింపలేదు. "చిత్రాసనముమీద గూరుచుండుట మాకేమియు వ్యతిరేకముకాదుగాని, పండితుల కవమానకరమగు" నని ప్రభువుల యుద్దేశము. ఆపద్ధతిని మేము రానేరామని రంగాచార్యులవారి సమాధానము.
ఇట్టి యాచార్యులవారి పాండితీ పటిష్టత యెంతగొప్పదో! అయన తర్క వ్యాకరణ మీమాంసా ద్యనేక శాస్త్రములలో సందెవేసినచేయి. మహా మహోపాధ్యాయ బిరుదుమునందిన మన తెలుగువారిలో బ్రథములు రంగాచార్యులవారు. వీరితరువాత తాతా సుబ్బారాయశాస్త్రిగారికే యాబిరుద మస్వర్థమై యందగించినది. పదపడి, దానిలోని బిగువు కొంత సడలిపోయి బెడగు తగ్గినది. శాస్త్రములలో నింత పరిశ్రమ చేయువారు, తెలుగుబాసపై తేలికచూపు వేయుదురు. వీరటులు కాదు. కాళిదాసు శాకుంతలము 1872 ళొదెలుగున నంతరించి 'సకల విద్యాభివర్ధనీ పత్రిక' లో రెండంకములు వెలువరించిరి. మిగిలిన గ్రంథము ప్రచురితమైనట్లు చూడలేదు. రంగాచార్యులవారి యీ తెలిగింపు వీరేశలింగము పంతులుగారి శాకుంతలాంధ్రీకృతికి గొంతయుత్సాహ మిచ్చినదని స్వీయ చరిత్రములోని పంతులుగారి వ్రాతవలన దెలియును.
ఎంతటి కఠినాంశ మయినను జేతి యుసిరికవలె నందజేయు చాతుర్యము రంగాచార్యులవారికి నినర్గజము. ఆయన మాటాడునపుడు జనులు ముగ్ధులగుచుండెడివారు. సభ్యుల యభిరుచులు కనిపెట్టి, యిట్టే తమయభిప్రాయము మార్చుకొని యుపన్యసించుటలో వీరికున్నంత నేరుపు వేఱెవరికి నుండదని పలువు రిప్పటికి జెప్పుకొనుట కలదు. 1889---లో వీరొకతూరి రాజమహేంద్రవరము వేంచేసినపుడు